తెలుగులో ‘పేట’ లేదా?

Update: 2018-12-04 05:59 GMT
తమిళ స్టార్‌ హీరోలందరి సినిమాలు కూడా తెలుగులో తప్పకుండా డబ్‌ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్‌ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా దాదాపు రెండు దశాబ్దాలుగా డబ్‌ అవుతూ, డైరెక్ట్‌ తెలుగు సినిమాల మాదిరిగా విడుదల అవుతూ వస్తున్నాయి. తాజా గా రజినీకాంత్‌ 2.ఓ సినిమా తెలుగులో 70 కోట్లకు పైగా మార్కెట్‌ చేసిందంటే ఆయన క్రేజ్‌ తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్‌ మూవీ అంటే తెలుగులో ఒక డబ్బింగ్‌ సినిమా అనే దృష్టితో ఏ ఒక్కరు కూడా చూడరు. అంతటి మార్కెట్‌ దక్కించుకున్న రజినీకాంత్‌ ప్రస్తుతం ‘పేట’ చిత్రంతో రెడీ అవుతున్నాడు.

రజినీకాంత్‌ హీరో గా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పేట’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. మరో వైపు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పేట చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రజినీకాంత్‌ ఏ సినిమా వచ్చినా తమిళంలో ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పుడే తెలుగులో కూడా ఫస్ట్‌ లుక్‌ వస్తుంది. కాని ఇప్పటి వరకు తెలుగు వర్షన్‌ కు సంబంధించి ఎలాంటి అప్‌ డేట్‌ ను పేట చిత్ర యూనిట్‌ సభ్యులు ఇవ్వలేదు.

తమిళంలో ఆడియో విడుదలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నా, తెలుగులో మాత్రం కనీసం చిన్న వీడియో కూడా విడుదల చేయలేదు. దాంతో తెలుగు వర్షన్‌ లో పేట రావడం లేదా అనే అనుమానాలను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే ఆ సినిమాలకు థియేటర్లు బుక్‌ అయ్యాయి. మిగిలిన కొన్ని థియేటర్లను అయినా ఇప్పటి నుండే పేటకు బుక్‌ చేస్తే ఉంటాయి. కాని తెలుగు రైట్స్‌ ను ఎవరు తీసుకున్నారో అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అసలు తెలుగు రైట్స్‌ అమ్ముతున్నారా అనేది కూడా తెలియడం లేదు. రజినీకాంత్‌ అభిమానులు పేట సినిమా తెలుగులో రాదా అనే ఆందోళనలో ఉన్నారు. వెంటనే పేట తెలుగు వర్షన్‌ పై చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించాలని సోషల్‌ మీడియా వేదికపై సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కోరుతున్నారు.
Tags:    

Similar News