2.0 రన్ టైమ్ ఎంతో తెలుసా?

Update: 2018-01-11 12:06 GMT
దేశవ్యాప్తంగా సౌత్ అభిమానులనే కాకుండా నార్త్ అభిమానులు కూడా ఎంతగానో ఒక సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రమే రజినీకాంత్ 2.0. బాహుబలి 2 తరువాత ఇండియాలోనే అంతకంటే ఎక్కువ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ సృష్టించిన ఈ అద్భుత సృష్టి దాదాపు రూ.450 కోట్లతో నిర్మించబడింది. పూర్తి 3డి టెక్నాలిజీతో స్కై ఫై థ్రిల్లర్ గా ఉండబోతోంది.

ఈ సినిమా షూటింగ్ గత ఏడాదే అయిపోయింది. కానీ గ్రాఫిక్స్ పనులవల్ల ఆలస్యం అవుతోందని అందరికి తెలిసిన విషయమే. ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోగానే తెలుగు తమిళ్ అలాగే హిందీ అరబిక్ సెన్సార్ వర్క్స్  పూర్తవుతాయి. ఇకపోతే సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. 2.0 రన్ టైమ్ 100 ననిమిషాలు ఉండబోతోంది. నిజంగా ఇది ఒక విధంగా ఆశ్చర్యంగా ఉంటే మరొక విధంగా లాభం కూడా చేకూరనుంది. సాధారణంగా శంకర్ సినిమాలు మూడు గంటలకు దగ్గరగా ఉంటాయి.
 
శంకర్ ఎక్కడా బోర్ కొట్టించకుండా మ్యాజిక్ స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేయగలడు. అలాంటిది మొదటి సారి శంకర్ కనీసం రెండు గంటల సినిమాను కూడా చూపెట్టకపోవడం ఆశ్చర్యమే. ఇక కలిసొచ్చే విషయం ఏమిటంటే ఈ రోజుల్లో సినిమా నిడివి ఎంత తక్కువగా ఉంటె అంత మంచిది. కొద్దీ సేపు ఎంటర్టైన్ చేసినా బావుంది అంటారు. మరి శంకర్ కొత్త ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక సినిమాను ఏప్రిల్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల రజినీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News