బాహుబలి సినిమాతో రాజమౌళి సంచలనం సృష్టిస్తే అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా హిస్టరీ క్రియేట్ చేయాలనీ దర్శకుడు శంకర్ సిద్ధం అయ్యాడు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా 2.0 విడుదల కానుంది. ఈ సినిమాకు దాదాపు 450 కోట్లకు పైగా ఖర్చుపెట్టారట లైకా ప్రొడక్షన్స్ వారు. దర్శకుడు శంకర్ ఇండియాలో ఎన్నడు వాడని టెక్నాలిజీని వాడుతూ త్రీడి లో సినిమాను రిలీజ్ చేయనున్నాడు.
అలాగే దేశంలో ఈ సినిమా కోసం చాలా థియేటర్స్ ఇప్పటికే 3డి ఫార్మాట్ లోకి వచ్చేశాయి. ప్రత్యేకంగా 2.0 సినిమా కోసం కొన్ని చిన్న థియేటర్స్ అలాగే గ్రామాలకు దగ్గరగా ఉండే టౌన్ సినిమా హాళ్లు సైతం కూడా అప్ గ్రేడ్ అవుతున్నాయట. ఇక అసలు విషయానికి వస్తే సినిమా రీసెంట్ గా చిత్రీకరణను మొత్తం పూర్తి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం వేసిన ఒక భారీ సెట్ లో రజినీకాంత్ - అమీ జాక్సన్ మధ్య ఒక సాంగ్ ని చిత్ర యూనిట్ షూట్ చేసింది. దీంతో సినిమా షూటింగ్ అంతా పూర్తయింది.
షూట్ చేయడానికి ఇంకేం లేదు నాయనా అంటున్నారు. గ్రాఫిక్స్ పనులు కూడా చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న టైమ్ కే సినిమా పూర్తయిందని జనవరి లో సినిమా రిలీజ్ తప్పకుండా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.ప్రస్తుతం ఆడియో వేడుక కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ నెల 27న దుబాయ్ లో గ్రాండ్ గా ఆడియో వేడుకను చేయనున్నట్లు శంకర్ తెలిపాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందించారు. పైగా దుబాయ్ లో ఆయన లైవ్ లో పెర్ఫామ్ చేస్తారు అంటూ రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు పిచ్చెక్కిస్తోంది.