రజినీ క్యారెక్టర్.. వెరీ ఇంట్రెస్టింగ్

Update: 2015-09-18 07:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయడమంటే మాటలు కాదు. ఆయన అంత సులువుగా ఎవరికీ అవకాశమివ్వరు. ఆయన ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీయడం చాలా కష్టం కాబట్టి సాధారణంగా అనుభవమున్న దర్శకులే ఆయనతో పని చేస్తుంటారు. కె.ఎస్.రవికుమార్ - శంకర్ - పి.వాసు - సురేష్ కృష్ణ.. ఇలా రజినీ గత కొన్నేళ్లలో చేసిన సినిమాలన్నీ సీనియర్ డైరెక్టర్ లతో చేసినవే. ఐతే ఈ సీనియర్లలో శంకర్ తప్ప మిగతా డైరెక్టర్లందరితోనూ ఎదురు దెబ్బలే తిన్నాడు సూపర్ స్టార్. అందుకే ఈసారి రూటు మార్చారు. రెండు సినిమాల అనుభవమున్న రంజిత్ అనే యువ దర్శకుడితో పని చేయబోతున్నారు. రజినీ పోషిస్తున్న పాత్ర, ఈ సినిమా కథాంశం కూడా రజినీ ఇమేజ్ కు భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం.

‘కబాలి’లో కబాలీశ్వరన్ అనే వయసు మీద పడ్డ డాన్ పాత్ర పోషించబోతున్నాడు రజినీ. మలేషియాలో మగ్గుతున్న తమిళ కూలీల కోసం చెన్నై నుంచి అక్కడికి వెళ్లి.. వారిని కాపాడే పాత్రలో కనిపించబోతున్నాడట రజినీ. ఐతే రొటీన్ గా రజినీ సినిమాలో ఉండే బిల్డప్పులు ఇందులో కనిపించవని.. సరిగ్గా తన వయసుకు తగ్గట్లే రజినీ ప్రవర్తిస్తాడని.. రంజిత్ తొలి రెండు సినిమాల తరహాలోనే ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుందని.. కోలీవుడ్ వర్గాల సమాచారం. హీరోయిన్ తో డ్యూయెట్లు.. రజినీ మార్కు సిగ్నేచర్ స్టయిల్స్.. ఇవేవీ కూడా ‘కబాలి’లో ఉండవని అంటున్నారు. అదే నిజమైతే రజినీ మంచి నిర్ణయం తీసుకున్నట్లే. ప్రేక్షకుల అభిరుచి మారుతోందని ఆయన గ్రహించినట్లే ఉన్నారు. ప్రతి సినిమాలోనూ ఒకేలా కనిపిస్తే ప్రేక్షకులు ఆమోదించే పరిస్థితి లేదు. వెరైటీ చూపించాల్సిందే మరి.
Tags:    

Similar News