ఎనిమిదేళ్ళ తరువాత రజనీ మీటింగ్

Update: 2017-05-11 02:55 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆన్ స్క్రీన్ పై ఏం చేసినా సంచలనమే. కదిలితే స్టైల్.. నడిస్తే స్టైల్.. ప్రతీ కదలిక ఓ సంచలనం అవుతుంది. అయితే ఆఫ్ స్క్రీన్ పై ఎంతో మొహమాటంగా ఉండే రజినీకాంత్.. కనీసం ఫ్యాన్స్ ను కలవడంలో కూడా అరుదుగానే జరుగుతూ ఉంటుంది. ఓ హీరోకు ఉండే ఫ్యాన్స్ క్లబ్ ల కౌంట్ విషయంలో రజినీకాంత్ కు అత్యధికంగా ఉంటాయి.

ఇప్పుడు అభిమానులను కలిసేందుకు రజినీ నిర్ణయించారు. శంకర్ రూపొందించిన శివాజీ మూవీ సక్సెస్ తర్వాత రజినీ ఇలా ఫ్యాన్స్ ను కలిశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ఫ్యాన్స్ మీట్ లు జరగలేదు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత అభిమానులతో ముచ్చటించేందుకు రజినీ టైం కేటాయించారు. మే 15 నుంచి 19వ తారీఖు వరకూ అభిమాన సంఘాల వ్యక్తులతో పలు దఫాలుగా భేటీ కానున్నారు రజినీ. వీటిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు కానీ.. జస్ట్ ఫోటో సెషన్స్ కు మాత్రమే అనేది పైకి చెప్పే మాట.

నిజానికి గత నెలలోనే ఇలా ఫ్యాన్స్ మీట్ అంటూ రజినీ ఫ్యాన్స్ కు పిలుపులు అందాయి. కానీ వీటిని ఎందుకనో అప్పుడు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నెల రోజుల్లోనే ఫ్యాన్స్ మీట్స్ ఏర్పాటు చేయడం.. అది కూడా ఐదు రోజులు కేటాయించడం చూస్తే.. ఏదో పెద్ద డెసిషన్ పై మంతనాలు జరిపేందుకే అనుకుంటున్నారంతా. బహుశా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉందని టాక్.
Tags:    

Similar News