రచయిత అవతారంలో సూపర్ స్టార్

Update: 2018-02-03 06:16 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త కోలీవుడ్ లో రోజుకో సంచలనాన్ని సృష్టిస్తోంది. రజినీ ఎలాంటి తరహాలో పాలిటిక్స్ ని లీడ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సూపర్ స్టార్ పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రెండు సినిమాలు. 2019 ఎలక్షన్ లో చక్రం తిప్పాలంటే రజినీ స్టామినా 2018లో తేలనుంది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. 2.0 అండ్ కాలా సినిమాలు రెండు ఇదే ఇయర్ లో రిలీజ్ కానున్నాయి.

అయితే ఆ సినిమాల రిజల్ట్ తో రజినీ కి పాలిటిక్స్ లో బలం చేకూరినట్లే అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ సీక్రెట్ గా ఒక కథను అల్లేశాడని తెలుస్తోంది. అప్పుడెప్పుడో వల్లి (1993) - బాబా (2002) సినిమాలకు కథను అందించిన రజినీ ఇన్నేళ్ల తరువాత తన పెన్నుకు పని పెట్టారట. ఇటీవల దర్శకుడు నటుడు సముథిరకని ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రజినీకాంత్ ఒక కథను రాశారనే విషయాన్ని బయటపెట్టాడు.

అంతే కాకుండా సముథ్రకని లీడ్ రోల్ లో నటించాలని కూడా ఆయన కోరారట. అయితే ఇంతకంటే ఎక్కువగా చెబితే బావుండదని మ్యాటర్ ని క్లోజ్ చేశాడట సముథిరాకని. మరి ఆ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ యాక్టర్ కాలా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇక సినిమా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ధనుష్ నిర్మొస్తోన్న ఆ సినిమాను కబాలి దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్నాడు.    



Tags:    

Similar News