తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఒక సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన వివాదంలో ఆమెకు సుప్రీం నుంచి ఊరట లభించలేదు. ఆ మధ్యన రజనీ కుమార్తె భారీ బడ్జెట్ తో కొచ్చాడయాన్ పేరుతో యానిమేషన్ మూవీని తీయటం తెలిసిందే. ఈ సినిమాను రజనీ కుటుంబం నిర్మించింది.
కొచ్చాడయాన్ కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ డైరెక్టర్లలో ఒకరైన లతా రజనీకాంత్ హామీతో యాడ్ బ్యూరో సంస్థ రూ.10కోట్ల రుణాన్ని ఇచ్చింది. అయితే.. తీసుకున్న రూ.10 కోట్లలో రూ.8.70 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. చిత్ర విడుదల సమయంలో తమకు చెప్పినట్లుగా చిత్ర నిర్మాతలు వ్యవహరించలేదని.. సమాచారం ఇవ్వలేదన్న విషయంతో పాటు.. తమకు ఇవ్వాల్సిన రుణాన్ని తిరిగి ఇప్పించాల్సిందిగా యాడ్ బ్యూరో కోర్టును ఆశ్రయించింది.
దీంతో.. లతా రజనీకాంత్ మీద ఎఫ్ ఐఆర్ దాఖలైంది. దీని రద్దు కోసం సుప్రీంను లతా రజనీకాంత్ ఆశ్రయించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఎఫ్ ఐఆర్ రద్దు చేసేందుకు నో చెప్పేసింది. కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. యాడ్ బ్యూరో సంస్థ లెక్కల ప్రకారం లతా రజనీకాంత్ అసలు..వడ్డీతో సహా రూ.6.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరి.. సుప్రీంలో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.