'మున్నాభాయ్ - 3' ఆగిపోయిందా?

Update: 2019-01-14 06:21 GMT
సంజ‌య్ ద‌త్ కథానాయ‌కుడిగా రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో `మున్నాభాయ్ ఎంబిబిఎస్` సిరీస్ ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. ఈ సిరీస్ లో ఇప్ప‌టికే రెండు సినిమాలు రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాయి. పార్ట్ 2 తెర‌కెక్కి ఇప్ప‌టికే చాలా కాల‌మైంది. ఇంత‌కాలం సంజూ భాయ్ జైలు జీవితం ఈ సిరీస్ లో మూడో సినిమాకి అడ్డంకిగా మారింది. ఆ క్ర‌మంలోనే త‌న క్లోజ్ ఫ్రెండ్ నేరాలేవీ ఉద్ధేశ పూర్వ‌కంగా చేసిన‌వి కావంటూ ప్రూవ్ చేస్తూ.. రాజ్ కుమార్ హిరాణీ సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ `సంజు` ని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం  ద‌త్- హిరాణీ జోడీ మున్నాభాయ్ ఎంబిబిఎస్ పార్ట్ 3 స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇటీవ‌లే ర‌ణ‌వీర్- గ‌ల్లీ బోయ్ టీజ‌ర్ ఈవెంట్ లో హిరాణీ అందుకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు.

ఈలోగానే మున్నాభాయ్ ఎంబిబిఎస్ 3 చిత్రం ఆగిపోయింద‌ని, ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వెన‌క‌డుగు వేసింద‌ని ప‌లు వెబ్ సైట్ల‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ వీవీసీ ఫిలింస్ తో క‌లిసి మూడు సినిమాల డీల్ కుదుర్చుకుంది. విధు వినోద్ చోప్రాను అందుకోసం సంప్ర‌దించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. హిరాణీతో పార్ట్ 3 ఉండ‌ద‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. హిరాణీ వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. సంజు బ‌యోపిక్ టైమ్ లో త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ ని హిరాణీ వేధించార‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది.

అయితే ఇవ‌న్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లేన‌ని రాజ్ కుమార్ హిరాణీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఖండించారు. ఇదంతా త‌న ప‌రువు మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించేందుకు ఆధారాలు లేకుండా వ‌స్తున్న అలిగేష‌న్స్ అని ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అలాగే మున్నాభాయ్ ఎంబిబిఎస్ పార్ట్ 3కి ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ‌ అస‌లు నిర్మాత కానేకాద‌ని ఆయ‌న అన్నారు. ఇక స‌ద‌రు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ని సంజు సెట్స్ పై ఉన్న‌ప్పుడు.. 2018 మార్చి నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లో 6నెల‌ల పాటు హిరాణీ ఒక‌టికి ప‌దిసార్లు నిరంత‌రాయంగా వేధించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయంటూ స‌ద‌రు వెబ్ సైట్లు క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.


Tags:    

Similar News