తలైవా.. సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాటే కాకుండా యావత్ భారతం మొత్తం తనదైన మార్కు మేనరిజమ్స్, స్టైల్స్ తో అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లోనూ కోట్లాది మంది అభిమానుల్ని దక్కించుకున్న రజనీకి జపాన్ లోనూ అభిమానులున్నారు. ఇలా జపాన్ లో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఏకైక ఇండియన్ హీరోగా రికార్డుల కెక్కారు. అలాంటి రజనీ పుట్టిన రోజు వేడుకలు డిసెంబర్ 12న జరగనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రజనీ పుట్టిన రోజంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అభామనులకు పెద్ద పండగే అలాంటి పండగ కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రక్తదానాలు, నిరుపేదలకు అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. రజనీ ఈ నెల 12 న 71వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పీవీఆర్ సంస్థ రజనీకాంత్ చిత్రోత్సవాల పేరుతో రజనీ నటించిన ప్రత్యేక సినిమాల ప్రదర్శనని డిసెంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నారు.
చెన్నై, కోయంబత్తూర్ లలో రజనీ నటించిన సినిమాలని ప్రనత్యేకంగా ప్రదర్శించబోతుండటం విశేషం. డిసెంబర్ 12న రజనీ నటించి స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా రజనీనే స్వయంగా నిర్మించిన 'బాబా' మూవీని 4కెలోకి రీ మాస్టర్ చేసి రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో పాటు రజనీ నటించిన శివాజీ, 2.ఓ, దర్బార్ వంటి సినిమాలని కూడా రజనీ పుట్టిన రోజు సందర్భంగా ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా వుంటే రజనీకాంత్ నటించి నిర్మించిన 'బాబా' 4 కె రీ మాస్టర్ చేసిన ప్రింట్ ని రీ సెంట్ గా చెన్నైలోని సత్యం థియేటర్లో ప్రత్యేకం ప్రివ్యూని వేసి ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకు నిర్మాత కలైపులి ఎస్. థాను, లతా రజనీకాంత్, గీత రచయిత వైరముత్తు తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేకంగా వీక్షించారు. 20 ఏళ్ల క్రితం చూసిన దానికి మించి పదిరెట్లు సరికొత్త అనుభూతిని 'బాబా' కలిగిస్తుందని, థియేటర్లలో అభిమానులు చప్పట్లు, ఈలలతో ఎంజాయ్ చేస్తారని లతా రజనీకాంత్ తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.