కోలీవుడ్ టూ బాలీవుడ్ వరకు విభిన్నమైన చిత్రాల్లో నటించి తనదైన మేనరిజమ్స్, స్టైల్స్ తో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు రజనీకాంత్. `రోబో` తరువాత ఆ స్థాయి సక్సెస్ ని చూసి దాదాపు పన్నెండేళ్లవుతోంది. ఈ మూవీ తరువాత రజనీ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వాలని రజనీకాంత్ పెద్ద మనసుతో అవకాశాలు ఇస్తున్నా ఏ డైరెక్టరూ నిరూపించుకోలేకపోతున్నారు. సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయారు.
ఆయనతో చేసిన `లింగా` ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో వరుసగా రజనీకాంత్ యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. పా. రంజిత్ కి బ్యాక్ టు బ్యాక్ రెండు అవకాశాలిచ్చారు. ముందు చేసిన `కబాలి` భారీ హైప్ ని తీసుకొచ్చి భారీ వసూళ్లని రాబట్టిందే కానీ రజనీ కోరుకున్న విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. ఆ తరువాత చేసిన `కాలా` పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ కనిపించలేదు.
ఇక శంకర్ `2.O`ని పక్కన పెడితే `పిజ్జా` చిత్రంతో పాపులారిటీని సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజుకి అవకాశం ఇచ్చారు. తనతో కలిసి చేసిన `పేట్టా` ఫ్లాప్ గా నిలవకపోయినా భారీ హిట్ గా మాత్రం నిలవలేకపోయింది. రజనీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నా కార్తీక్ సుబ్బరాజు వారి అంచనాలని నీరు గార్చాడు. ఇక ఇదే ఊపులో మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు రజనీ. తనే సిరుతై శివ. అజిత్ తో బ్లాక్ బస్టర్ లు అందించిన సిరుతై శివ.. రజనీతో చేసిన `అన్నాత్తే` ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో ఎవరికీ తెలియతేదు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ భారీ ఫ్లాప్ గా నిలిచి షాక్ ఇచ్చింది. ఈ మూవీ కంటే ముందు మురుగదాస్ కి అవకాశాం ఇచ్చిన `దర్బార్` పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. రజనీ ని ఏజ్ బార్ హీరోగా చూపించిన తీరు ఆయన అభిమానుల్ని నిరాశపరిచింది. కథ కొత్తగా లేకపోవడం కూడా ఈ సినిమాకు ప్రధాన లోపంగా మారింది.
ఇప్పటికైనా రజనీ పంథా మార్చుకుంటారనుకుంటే మళ్లీ యంగ్ డైరెక్టర్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇళయదళపతి విజయ్ తో `బీస్ట్` మూవీని డైరెక్ట్ చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రజనీ 169వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించబోతున్నారు. ఇది నెల్సన్ దిలీప్ కుమార్ కు నాలుగవ సినిమా. ఈ దర్శకుడైనా రజనీకి బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి అంటున్నారు రజనీ ఫ్యాన్స్.