తమిళ సూపర్ స్టార్ ఖ్యాతి ఇప్పుడు మరింతగా పెరగనుంది. ఆయనకు అవార్డులు రివార్డులు కొత్తేం కాదు కానీ... ఇప్పుడు వచ్చినది ఖచ్చితంగా గొప్ప అవార్డే. మన దేశంలో భారత రత్న తర్వాత రెండో అతి గొప్ప అవార్డు పద్మ విభూషణ్. ఇప్పుడు రజినీకాంత్ కు ఆ అవార్డ్ ఇచ్చినట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ.
ఆయా రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులు చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులకు ఎంపిక చేస్తారు. సినీ రంగం నుంచి రజినీకాంత్ ను ఎంపిక చేసి, ఆ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిజానికి సినిమా రంగానికి పద్మ విభూషణ్ ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి పద్మ భూషణ్ తో సరిపెట్టేస్తారు. కానీ రజినీకాంత్ కి మాత్రం పద్మవిభూషణ్ అవార్డునే ప్రదానం చేయనుండడం విశేషం.
దాదాపు 40 ఏళ్ల పాటు సినీ రంగానికి సేవలు అందించి, ఇప్పటికీ కోట్లాది మందికి అభిమాన దేవుడిగా ఉంటూ.. దేశవిదేశాల్లో ఖ్యాతిని గడించిన రజినీకాంత్.. పద్మ విభూషణ్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు అని సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మరోవైపు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు, అలాగే ఉదిత్ నారాయణ్ కు కూడా పద్మ భూషణ్ ను ప్రకటించింది కేంద్రం.