సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అంటే.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోనే ఎదురుచూసే పరిస్థితి. రోబోతో రజినీ రియల్ స్టామినా ఏంటో చాలామందికి తెలిసొచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొచ్చాడయాన్ - లింగా మూవీలు రజినీ ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసిన మాట వాస్తవమే.
సూపర్ స్టార్ ఇమేజ్ పై వచ్చిన అనుమానాలన్నీ కొత్త మూవీ రిలీజ్ కి రెడీ అయ్యేవరకే. తర్వాత మళ్లీ అంచనాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు కబాలి రెడీ అయిపోవడంతో.. కొత్త ఎక్స్ పెక్టేషన్స్.. అందుకు తగ్గట్లుగానే బిజినెస్ జరుగుతోంది. పాత నష్టాలను మర్చిపోయి మరీ.. కొత్త కొత్తగా భారీ ఆఫర్స్ తో రైట్స్ సొంతం చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పటికే కబాలి ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు దాటిపోయిందని తెలుస్తోంది. ఇంకా కొన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ సెట్ అవ్వాలన్నది నోట్ చేసుకోవాల్సిన పాయింట్.
ఓ మూవీ విడుదలకు ముందు బిజినెస్ 200 కోట్లు దాటడమంటే.. ఖచ్చితంగా అది బాహుబలి చేసిన బిజినెస్ తో పోటీ పడ్డమే. ఇప్పటివరకూ బాహుబలికి సమానంగా మరే చిత్రానికి డిమాండ్ రాలేదు. కానీ కబాలి లెక్కలు మాత్రం ఆ మార్క్ ను దాటుతాయని కొన్ని అంచనాలున్నాయి. అదే జరిగితే తన పవర్ ఏంటో సూపర్ స్టార్ చూపించినట్లే. ఇక ఈ నెల 9న ఆడియో విడుదల కార్యక్రమం పూర్తి చేసి.. జూలై 1న కబాలిని విడుదల చేసేందుకు వీలుగా నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు.