ఓపక్క తెలుగు సినిమా ‘అ..ఆ’ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. మరోపక్క తమిళ-తెలుగు భాషల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘కబాలి’ సినిమా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు. ఇంతకుముందు వార్తలొచ్చినట్లే జులై 1న ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ మేరకు అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చేశాడు. తెలుగు మీడియా సంస్థలకు కూడా ఈ ప్రెస్ నోట్ అందింది. జులై 1న సినిమాను.. జూన్ మొదటి వారంలో ఆడియోను రిలీజ్ చేయబోతున్నట్లు థాను ప్రకటించాడు. ‘కబాలి’ తెలుగు ఆడియోను హైదరాబాద్ లో భారీ ఎత్తున చేయబోతున్నట్లు వెల్లడించాడు.
ముందు అనుకున్న ప్రకారమైతే కబాలి మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో విడుదలవ్వాలి. రజినీకాంత్ స్వయంగా ఈ మేరకు మీడియా వాళ్లతో అన్నాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతుండటంతో సినిమాను జులై 1కి వాయిదా వేసేశారు. ఈ మేరకు వార్తలొచ్చినా.. అఫీషియల్ న్యూస్ కోసం చాలామంది తెలుగు.. తమిళ నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. రజినీ సినిమా సంగతేతో కన్ఫమ్ అయితే దాన్ని బట్టి తమ సినిమాల విడుదలను ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నారు.
‘కబాలి’ మీద 20 రోజుల కిందటి వరకు మరీ అంచనాలేమీ లేవు. కానీ టీజర్ రిలీజయ్యాక ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి. ‘కబాలి’ టీజర్ యూట్యూబ్ రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ప్రేక్షకులు టీజర్ చూసి ఫిదా అయిపోయారు. తెలుగులో ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేయబోతోంది.