రజినీ సినిమా తెలుగు టైటిల్ ఫిక్స్

Update: 2015-11-08 08:53 GMT
కోచ్చడయాన్ - లింగ లాంటి డిజాస్టర్ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా కబాలి. యువ దర్శకుడు రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కథానాయకుడి పేరు కబాలీశ్వరన్. దాన్ని షార్ట్ చేసి.. ‘కబాలి’ అనే టైటిల్ పెట్టాడు రంజిత్. ఐతే అది అచ్చమైన తమిళ పేరు కాబట్టి.. తెలుగు వెర్షన్ కి వేరే పెట్టబోతున్నట్లు ముందే చెప్పాయి యూనిట్ వర్గాలు. ఐతే తాజా సమాచారం ఏంటంటే.. ‘కబాలి’ తెలుగు వెర్షన్ కి ‘మహాదేవ్’ అనే టైటల్ ఫిక్స్ చేశారట.

తమిళంలో విడుదల చేసిన పోస్టర్లకే తెలుగు టైటిల్ యాడ్ చేసి.. ఇంకో రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లు వదలబోతున్నారట. చెన్నైలో మూడు వారాల తొలి షెడ్యూల్ పూర్తయ్యాక ‘కబాలి’ షూటింగ్ మలేషియాకు షిఫ్టయింది. సినిమాలో దాదాపు 75 శాతం మలేషియాలోనే సాగుతుందని రజినీనే స్వయగా వెల్లడించాడు. సినిమా పూర్తయ్యే వరకు అక్కడే షూటింగ్ చేసి.. ఆ తర్వాతే చెన్నైకి రాబోతోంది కాబాలి టీమ్. రజినీ మాఫియా డాన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన భార్యగా రాధికా ఆప్టే నటిస్తోంది. జేడీ చక్రవర్తి - కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతాన్నందిస్తున్నాడు. కలైపులి థాను నిర్మాత.
Tags:    

Similar News