చిన్న సినిమా తగ్గట్లేదసలు

Update: 2015-11-13 17:30 GMT
దసరా తర్వాతి వారం వచ్చిన షేర్ అడ్రస్ లేదు. ఆ తర్వాతి వారం వచ్చిన ‘త్రిపుర’ కూడా వారానికే కనుమరుగైపోయింది. కానీ దసరా సినిమా ‘రాజుగారి గది’ మాత్రం ఇంకా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకెళ్తుండటం విశేషం. మూడు వారాల తర్వాత కూడా ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ థియేటర్లలో రన్ అవుతోంది. యుఎస్ లో రెండు వారాలు ఆలస్యంగా విడుదలైన ఆ సినిమా అక్కడ కూడా అదిరిపోయే వసూళ్లు సాధిస్తుండటం విశేషం.

ఈ సినిమా ఇప్పటికే పది కోట్ల క్లబ్బును అందుకోవడం విశేషం. ఇవి షేర్ వసూళ్లే. గ్రాస్ కూడా కలిపితే రూ.13 కోట్ల దాకా ఉంది లెక్క. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.3 కోట్ల లోపే కావడం విశేషం. తొలి వారంలోనే బయ్యర్ల పెట్టుబడిని తిరిగి తెచ్చేసిన ‘రాజు గారి గది’.. రెండో వారం నుంచి లాభాలు అందిస్తోంది. ఇప్పటికే పెట్టుబడి మీద మూడు రెట్లకు పైనే వసూలు చేసిందీ సినిమా.

దసరా తర్వాత వచ్చిన సినిమాలు ప్రభావం చూపకపోవడంతో వాటి స్థానంలో ‘రాజు గారి గది’నే రీప్లేస్ చేశారు. ప్రస్తుతం అఖిల్ తర్వాత అత్యధిక థియేటర్లలో ఆడుతున్న సినిమా ‘రాజు గారి గది’నే కావడం విశేషం. ఈ సినిమాతో పాటు రిలీజైన ‘కంచె’ చాలా తక్కువ థియేటర్లలోనే ఆడుతోంది.
Tags:    

Similar News