మొదట వరుస విజయాలతో దూసుకుపోయిన రాజ్ తరుణ్.. కొంతకాలంగా డిజప్పాయింట్ చేస్తున్న మాట వాస్తవమే. రకరకాల కాన్సెప్టులతో ప్రయోగాలు చేస్తున్నా.. సినిమాల రేంజ్ పెరగకపోవడంతో.. జనాల్లో ఆసక్తి సన్నగిల్లింది. కానీ ఈ సారి మాత్రం రాజుగాడు అంటూ పక్కా కంటెంట్ తోనే వస్తున్నాడు రాజ్ తరుణ్.
ఇప్పుడు రాజుగాడు మూవీకి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో రోగాల థీమ్ బాగా వర్కవుట్ అవుతుండడంతో.. ఇందులో రాజ్ తరుణ్ కు దొంగతనం చేయకుండా ఉండలేకపోవడం అనే బలహీనతను జోడించారు. ఆంగ్లంలో క్లెప్టోమేనియాక్ అని ఇలాంటి వ్యక్తులను అంటారు. ఆ బలహీనత ఉన్న హీరో.. అమ్మాయి ఐ లవ్యూ చెబుతుంటే ఫీల్ కావడం మానేసి.. అమ్మాయి మొహం చూడ్డం మానేసి.. ఆమె ధరించిన ఆభరణాలను దొంగతనం చేయాలనే ఆలోచనలోనే ఉండేంతటి ప్రభావం ఉన్న రోగం అన్నమాట.
హీరో దొంగోడు అంటే ఆటోమేటిగ్గానే నవ్వులు పండుతాయి. అందులోను రాజ్ తరుణ్ లాంటి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తే మరింతగా మెప్పించడం ఖాయం. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పాత్రల్లో సితార-రాజేంద్ర ప్రసాద్ కూడా బాగానే నవ్వులు పండించే ప్రయత్నం చేశారు. విలన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉండాలి కాబట్టి.. దొంగతనాలను అస్సలు సహించలేని తత్వం.. విలన్ సెటప్ కి తగిలించారు. హీరోయిన్ అమైరా దస్తూర్ ను పెళ్లి చేసుకునేందుకు.. ఈ రాజుగాడు ఏం చేశాడన్నదే మూవీ. 2 నిమిషాల ట్రైలర్ లో కథ అంత చెప్పేసినా.. ట్రైలర్ లో డైలాగులు బాగానే పేలాయి. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే.. రాజుగాడు మెప్పించడం ఖాయమే.
మన దగ్గర లేడీ డైరెక్టర్లు చాలా తక్కువగా ఉంటారు. కొత్తగా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న సంజనా రెడ్డి.. మంచి ప్రయత్నమే చేస్తోంది. మరి ఈ మూవీ సక్సెస్ సాధిస్తే.. టాలీవుడ్ అకౌంట్ లో మరో మంచి లేడీ డైరెక్టర్ జమవుతుంది.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View