ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ సెప్టెంబర్ 6న 73వ ఏట అడుగుపెట్టాడు. ఈ సంతోషకరమైన సందర్భంగా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ తన పుట్టినరోజు ప్రణాళికలు బాక్సాఫీస్ వద్ద హిందీ పరిశ్రమ ప్రస్తుత దృశ్యం గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడాడు. ముఖ్యంగా సౌత్ బ్లాక్ బస్టర్లపై అతడు ప్రశంసలు కురిపించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన గ్రేట్ ఫిలింమేకర్ రాకేష్ రోషన్ తాజా ఎక్స్ ప్లోసివ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు. హమారే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కో పాట నహీం క్యా హో గయా హై... అని అన్నారు. మనవాళ్లంతా 'ఇది ఆధునిక సినిమా' అని పిలవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది కేవలం 1 శాతం జనాభాకు మాత్రమే వర్కవుటవుతుంది! అని రాకేష్ రోషన్ బాలీవుడ్ లో లోపాన్ని ఎత్తి చూపారు.
చాలా హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు. ఏం తప్పు జరుగుతోందని మీరు అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు... సమాధానమిస్తూ.. మన దర్శకనిర్మాతలు తమ స్నేహితులు వారి స్నేహితులు చూడటానికి ఇష్టపడే సినిమాలు చేస్తున్నారు. వారు చాలా తక్కువ మంది ప్రేక్షకులకు నచ్చే సబ్జెక్ట్ లను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులలో పెద్ద భాగంతో దీనికి సంబంధం లేదు. మరో ప్రధాన సమస్య ఏంటంటే.. సినిమాలో పాటలు బయటకు వెళ్లడం... లేదా పాటలు నేపథ్యానికి మళ్లించేస్తున్నారు. కొన్నిసార్లు ముఖ్దా మాత్రమే ప్లే చేస్తున్నారు.. ఇంతకు ముందు 6 పాటలు ఉండేవి. నటీనటులు సూపర్ స్టార్లుగా మారడానికి ఈ పాటలు సహాయపడతాయి. ఆప్ పురానే గానో సే హీరో కో యాద్ రక్తే హై... పాత క్లాసిక్స్ విన్నప్పుడల్లా ఆ పాటల్లో నటించిన హీరోలు గుర్తొస్తారు. ఈ రోజుల్లో పాటలు లేవు కాబట్టి సూపర్ స్టార్ అవ్వడం చాలా కష్టం.. అని వ్యాఖ్యానించారు.
అమితాబ్ బచ్చన్- రాజేష్ ఖన్నా- జీతేంద్ర -దేవ్ ఆనంద్- సంజీవ్ కుమార్-షమ్మీ కపూర్- రాజ్ కపూర్- శశి కపూర్ మొదలైన వారి పాటలను మనం ఆస్వాధించాం. వారి పాటలు సినిమాలో అంతర్భాగంగా ఉండేవి. స్టార్లంతా వాటిని రూపొందించడంలో పెద్ద పాత్ర పోషించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఉదాహరణకు పుష్ప లేదా RRR తీసుకోండి. ఒక్కో పాట ఒక్కో క్రేజ్ గా మారింది. కాబట్టి మనం (దాని విజయం నుండి) నేర్చుకోవాలి... అని అన్నారు.
మీరు స్క్రిప్ట్ లలో పాటలను రాయడం.. ఏకీకృతం చేసే ప్రక్రియ గురించి చెప్పగలరా? అని ప్రశ్నించగా.. ఇది మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కహో నా ప్యార్ హై (2000) వంటి చిత్రానికి.. రొమాంటిక్ చిత్రం కాబట్టి పాటలు అవసరం. ఇక విక్రమ్ వేద లాంటి సినిమాలో పాటలకు స్కోప్ లేదు. అయితే ఇందులో యాక్షన్ డైలాగ్ బాజీ మొదలైన వాటికి స్కోప్ ఉంది.
నేడు బాలీవుడ్ లో కమర్షియల్ హిట్ లను అందించగల లేదా పాన్-ఇండియా చిత్రాలను తీయగల దర్శకుల సంఖ్యను లెక్కించడం దురదృష్టవశాత్తు కష్టం. దక్షిణాదిలో ఈ దృశ్యం భిన్నంగా ఉంది. సౌత్ లో ఇప్పటికీ పాతుకుపోయిన కథలకే అతుక్కుపోయి కమర్షియల్ సెన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకుని మరీ అప్ గ్రేడెడ్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్- బాహుబలి లాంటి సినిమాలు చూస్తే చావు దెబ్బ కొట్టే కథలున్నాయి.
బాహుబలి 'కరణ్ అర్జున్'ని పోలి ఉంటుంది. కానీ అది పెద్ద ఎత్తున ప్రదర్శితమైంది. పాటలు కూడా లార్జర్ దేన్ లైఫ్ లో తెరకెక్కించారు. అందువల్ల ప్రజలను ఆకర్షించాయి. ఔర్ హమారే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కో పతా నహీం క్యా హో గయా హై. వారు భారతీయత మూలాలకు దూరమయ్యారు. వారు 'ఆధునిక సినిమా' అని పిలవడానికి ప్రయత్నిస్తారు.. కానీ అది కేవలం 1శాతం జనాభాతో మాత్రమే పని చేస్తుంది. ఇది బి- సి సెంటర్లకు అందడం లేదు. కాబట్టి మీరు C- B మరియు A సెంటర్ లకు సరిపోయే సబ్జెక్ట్ లను ఎంచుకుని, వాటిని చాలా వినూత్నంగా ప్రదర్శిస్తే అది అందరికీ నచ్చుతుంది... అని తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు రాకేష్ రోషన్.
మహమ్మారికి ముందు భారీ ఓపెనింగ్ లతో గండం నుంచి తప్పించుకోవచ్చని .. ప్రారంభ వారాంతంలో తమ పెట్టుబడిని తిరిగి పొందవచ్చనేది మనకు తెలుసు. ఇప్పుడు పెద్ద స్టార్ల సినిమాలకు కూడా ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి కాలంలో దర్శకనిర్మాతలు మంచి స్క్రిప్ట్ లకు ఎక్కువ సమయం కేటాయించకుండా లెక్కలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సినిమా అంటే దర్శకుడికి అభిరుచి ఉండాలి. మీరు దర్శకుడి ముద్రను చూడకపోతే ఆ చిత్రం ఎప్పటికీ రాణించదు. మీ మొదటి స్పందన ఇలా ఉండాలి. వావ్...! అతడు ఏం చేసాడు! అనాలి. సినిమా మాట్లాడాలి... అప్పుడే ఏదైనా సాధ్యం అని రాకేష్ రోషన్ అన్నారు.
పుట్టినరోజు గురించి ప్రశ్నించగా.. రిషి కపూర్ ఉన్నప్పుడు అతని పుట్టినరోజు సెప్టెంబర్ 4. కాబట్టి ఆ రోజు మేము పెద్ద పార్టీ చేసుకునేవాళ్లం. సెప్టెంబర్ 5న నా మరో స్నేహితుడి పుట్టినరోజు. అతను లండన్ లో ఉంటాడు. మాతో జరుపుకోవడానికి అతను ముంబైకి వస్తుంటాడు. మరి 6వ తేదీన నా పుట్టినరోజు. కాబట్టి వారం మొత్తం మేము సెలబ్రేట్ చేసుకునేవాళ్లం.. కానీ అది ఇప్పుడు లేదు. కుటుంబంతో గడిపేసాను అని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.