ఇప్పుడు బాలీవుడ్ మొదలుకుని కోలీవుడ్ దాకా మీటూ ప్రకంపనలు ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు దీన్ని పక్కదారి పట్టించెందుకో లేక తమకు అనుకూలంగా పబ్లిసిటీ ఆయుధంగా వాడుకునేందుకో ఎవరికి వారు ప్రయత్నించడం కథను కొత్త మలుపులు తిప్పుతోంది. ఈ మీటూ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తనుశ్రీదత్తా లెస్బియన్ అంటూ ఆరోపణలు చేసి తన మీద రేప్ అటెంప్ట్ కూడా చేసిందని ఘాటు విమర్శలు చేసిన ఐటెం బాంబ్ రాఖీ సావంత్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది.
తన ఇన్స్ టాగ్రామ్ ను వేదికగా చేసుకుని వదిలిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారి కొత్త వివాదాలను రేపెలా ఉంది. విచిత్ర వేషధారణతో వీడియో చేసి అందులో నడుము కింది భాగాన్ని పెద్ద తాళంతో కవర్ చేసి దాని చుట్టూ సంకెళ్లు వేసుకుని పరిశ్రమలో అమ్మాయిలు తమను తాము కాపాడుకోవాలి అంటే ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదని సెలవిచ్చింది . ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అసలు సినిమా పరిశ్రమ మీద ఉన్న జనానికున్న అభిప్రాయాలను సమూలంగా దెబ్బ తీసేలా ఉందని మరీ ఇంత దిగజారి వీడియో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. అఫ్ కోర్స్ తనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు లెండి.
నిజానికి ఈ వీడియోలో రాఖీ హద్దులు దాటేసిందనే చెప్పాలి. మీటూ బాధితుల్లో కొందరు తమ స్వార్థం కోసం ఈ ఇష్యూని వాడుకోవడం పట్ల ఇప్పటికే చర్చ జరుగుతున్న తరుణంలో పరిశ్రమలో ఆడాళ్లకు రక్షణే లేదు అనే రీతిలో రాఖీ ఇలా అసభ్యకర ప్రకటనలు చేయటం మాత్రం సమర్ధనీయం కాదు. ఇంతకు ముందు ఏదో ఒక వివాదం ద్వారా లైమ్ లైట్ లో ఉండటం అలవాటు చేసుకున్న రాఖీ గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. ఇన్నాళ్లకు మీటూ రూపంలో ఛాన్స్ దొరికింది. వదులుతుందా.