తెలుగమ్మాయ్ రక్షిత ఎలియాస్ హాసిక ఎలియాస్ ఆనందిని (తమిళ్ లో కొత్త పేరు) ప్రస్తుతం తమిళ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. ఇటీవలే త్రిష ఇలియానా నయనతార` వంటి అడల్ట్ కామెడీ సినిమాతో తమిళ తంబీల్ని ఓ రేంజులో మెప్పించింది. ఈ మూవీలో ఆనందిని బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. టీనేజీ కుర్రాళ్ల ఓపెన్ లవ్ ఫీల్ ని తెరపై యథాతథంగా చూపించడంలో దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ 200 పర్సంట్ సక్సెసయ్యాడని పేరొచ్చింది.
తమిళ నాట బాక్సాఫీస్ ని గడగడలాడించింది ఈ సినిమా. అయితే తెలుగమ్మాయివి అయ్యి ఉండీ.. ఇలాంటి బోల్డ్ ఎటెంప్ట్ చేశారేంటి? అని రక్షితను మన హైదరాబాదీలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ సినిమా జోనర్ ఏంటో నాకు ముందే తెలీదు. అసలు నా క్యారెక్టర్ ఏంటో కూడా నాకు క్లారిటీ లేదు. ఆన్ సెట్స్ వెళ్లే వరకూ అంతా సస్పెన్స్. స్టోరీ చెప్పినప్పుడు క్యూట్ టీనేజీ లవ్ స్టోరీ అన్నట్టే చెప్పారు. కానీ తీరా సెట్స్ కెళ్లాక అసలు సంగతి అర్థమైంది. డైలాగులు చెబుతుంటే ఓహో ఇదో అడల్ట్ కామెడీ అని తెలుసుకున్నా. అసలు నా డైలాగ్ పోర్షన్ ఏంటో కూడా సెట్ కెళ్లే ముందు వరకూ తెలీనేతెలీదు.. అంటూ అమాయకత్వం కలబోసిన మాటలు వినిపించింది.
ఈ అమ్మడి వాలకం చూస్తుంటే ఏమీ తెలీదు తెలీదు అంటూనే ఏకంగా గ్రాండ్ మస్తీ లాంటి సినిమాలో నటించేసింది. ఇప్పుడు ఆనందిని అంటే అందరికీ తెలుసు. తెలుగులోనూ బస్ స్టాప్ సినిమాతో అంతే ఫేమస్ అయ్యింది. ఇది కూడా ఓ అడల్ట్ కామెడీనే. అప్పటికి కెరీర్ తొలి సినిమానే కాబట్టి తెలియదనుకోవచ్చు కానీ.. ఇప్పటికే బోలెడన్ని అనుభవాలు వచ్చాక కూడా ఇంకా తెలీదు అంటే ఎవరైనా నమ్ముతారా?