అందాల వడ్డనలు ఒక వైపు.. కెరీర్ పరుగు ఇంకోవైపు.. ఫిట్నెస్ ప్రీక్ రకుల ప్రీత్ సింగ్ బిజీ షెడ్యూళ్ల గురించి తెలిసిందే. అయితే ఇంత బిజీ షెడ్యూళ్లలోనూ రకుల్ ఇప్పుడు గోల్ఫ్ ఆడుతూ కనిపించింది. అది కూడా సేవ్ సాయిల్ ఉద్యమ కర్త.. సద్గురుతో .. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో కలిసి గోల్ఫ్ ఆడుతూ రకుల్ అభిమానులను అలరించింది.
గోల్ఫ్ అనేది ఖరీదైన క్రీడ. ఫేజ్ 3 వరల్డ్ రిలాక్స్ లైఫ్ కోసం ఎంపిక చేసుకునే కోర్స్ ఇది. ఇప్పుడు ఈ ఆటను ఇద్దరు విభిన్న రంగాలకు చెందిన దిగ్గజాలతో కలిసి రకుల్ ప్రమోట్ చేస్తోంది. సె అకబా.. రీమిక్స్ మ్యూజిక్ ని జోడించి మరీ ఈ వీడియోని రకుల్ షేర్ చేసింది. ప్రస్తుతం యువతరంలో ఇది జోరుగా వైరల్ అవుతోంది. ఇంతకీ రకుల్ గోల్ఫ్ ఆడుతున్నది ఏ ప్రదేశంలో అంటే.. అమెరికాలో..
జులై 2న వాషింగ్టన్ లో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 17వ కన్వెన్షన్ కోసం ఏర్పాట్లు ఇవి. వాషింగ్ టన్ డీసీల సద్గురు కపిల్ తో కలిసి ATA కన్వెన్షన్ ని లాంచ్ చేయడం కంటే ఉత్తమమైనది ఇంకేది ఏం ఉంటుంది? అంటూ రకుల్ ఆనందం వ్యక్తం చేసింది.
ATA కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ లో ఎంఎల్ సి K కవిత తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. నగరంలో ATA ప్రతినిధులు నిర్వహించే ప్రైమ్ మీట్ లో కవితతో పాటు రకుల్ కూడా పాల్గొంటారని తెలిసింది.
వాషింగ్టన్ DCలోని వాల్టర్ E కన్వెన్షన్ సెంటర్ లో జూలై 1 నుండి 3 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. భారతదేశం సహా USA నుండి తెలుగు మేధావులు- సాంకేతిక నిపుణులు- వైద్యులు- ప్రముఖ వ్యాపారవేత్తలు- సాంస్కృతిక సాహిత్య నిపుణులు ఈ కాన్ఫరెన్స్ లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా బతుకమ్మ పుస్తకాన్ని కూడా కవిత ఆవిష్కరించనున్నారని సమాచారం.
రకుల్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. టాలీవుడ్ లో కాలం కలిసి రాని రకుల్ బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది. అయితే అక్కడా ఆశించినది దక్కడం లేదు. రకుల్ హీరోయిన్ గా నటించిన అటాక్ ఏప్రిల్ 1న విడుదలైంది. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ హీరోయిన్. ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అలాగే దేవగన్ తో కలిసి నటించిన రన్ వే 34 ఏప్రిల్ 29న విడుదలయ్యింది. ఈ మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజుకు చేరలేదు. తదుపరి చిత్రాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Full View