వెండితెరకి ఎప్పటికప్పుడు ఎంతోమంది అందమైన కథానాయికలు వస్తుంటారు. సిల్వర్ స్క్రీన్ కి తమ గ్లామర్ ఘాటు చూపించడానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. స్టార్ హీరోయిన్స్ రేసులోకి అడుగుపెట్టడమే చాలా కష్టం. ఒకసారి ఆ ట్రాకులోకి వెళ్లిన తరువాత ఒకటి రెండు ఫ్లాపులు ఎదురైనా పెద్దగా ప్రమాదం ఉండదు. అప్పటికప్పుడు మూటాముల్లె సర్దు కోవలసిన పరిస్థితి రాదు. కానీ ఎందుకో రకుల్ విషయంలో మాత్రం ఎర్రర్ కొట్టేస్తోంది. ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ పడిపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
కాజల్ .. తమన్నా మాదిరిగానే చిన్న హీరోలతో .. చిన్న సినిమాలతో రకుల్ తన కెరియర్ ను మొదలుపెట్టింది. అందం .. అందుకు తగిన అభినయం ఆమెకి వరుస అవకాశాలు తెచ్చిపెట్టాయి. అవకాశాల కోసం ఆమె వెయిట్ చేయవలసిన అవసరం రాలేదు. ఎన్టీఆర్ తో 'నాన్నకు ప్రేమతో' .. చరణ్ తో 'ధ్రువ' .. అల్లు అర్జున్ తో 'సరైనోడు' వంటి స్టార్ హీరోల సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2017లోనే ఆమె నాలు గు సినిమాలు చేసింది. 'స్పైడర్'తో పాటు ఆ ఏడాది వచ్చిన సినిమాలన్నీ అంతగా ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయాయి.
ఇక అక్కడి నుంచి ఆమె గ్రాఫ్ పడిపోతూ రావడం మొదలైంది. సరైన కథలను .. పాత్రలను ఎంచుకోకపోవడమనేది స్పష్టంగా తెలుస్తుంది.
కెరియర్ పరంగా కాస్త బ్యాడ్ టైమ్ నడుస్తున్నప్పుడు ఎవరైనా కొంత ఓపిక పడుతుంటారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తారు. కానీ రకుల్ అలా చేయలేదు. 'మన్మథుడు 2'లో విషయం లేదని తెలిసి కూడా ఆమె ఆ సినిమాను చేసింది. ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్రతో 'చెక్' సినిమా చేసింది. వైష్ణవ్ తేజ్ జోడిగా తాను సెట్ కానని తెలిసి 'కొండపొలం' ఒప్పుకుంది.
ఇక ఈ పొరపాట్లతో పాటు రకుల్ మరో తప్పుకూడా చేసింది. హిందీ సినిమాల కోసం ఒక్కసారిగా ఆమె తెలుగు సినిమాలను పక్కన పెట్టేసింది. కాజల్ .. తమన్నా వంటివారు ఇక్కడి సినిమాలు చేసుకుంటూనే బాలీవుడ్ లో కుదురుకోవడానికి ట్రై చేశారు.
కుదరకపోవడంతో ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. ఇలియానా మాత్రం గ్యాప్ ఇచ్చేసి వెళ్లి కెరియర్ ను చెడగొట్టుకుంది. ఇప్పుడు అదే బాటలో వెళ్లిన రకుల్ కి ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. చేతిలో ఉన్న బాలీవుడ్ సినిమాలు హిట్ అయితే ఓకే, లేదంటే తాను చేసిన పొరపాటు ఏంటనేది తెలుసుకునే అవకాశం రకుల్ కి కలుగుతుంది .. అంతే!