కలల వెంట జర్నీ చేయమంటోంది.. మరెందుకు లేటు..?

Update: 2021-01-26 04:30 GMT
భానుడు అప్పుడే పైకొస్తున్నప్పుడు.. లేలేత సూర్య కిరణాలు మనల్ని స్పృశిస్తున్న‌ప్పుడు.. అటు చ‌లి, ఇటు నులివెచ్చ‌ని వేడి ఒకేసారి ఫీల‌వుతుంటే ఎలా ఉంటుందీ..? ఆ స్పర్శ భ‌లేగా ఉంటుంది క‌దూ..! ఆ స‌మ‌యంలో ప్ర‌శాంత‌మైన మ‌ది.. ఈ లోకాన్ని త‌న‌దైన దృష్టితో చూస్తుంది. స‌రికొత్త ఆలోచ‌న‌ల్ని రేకెత్తిస్తుంది.

ఈ అనుభూతిలోంచి వ‌చ్చిన ఓ సూచ‌న‌ను ఇన్ స్టా వేదిక‌గా మ‌న‌వైపు విసిరింది మోస్ట్ బ్యూటీ ఫుల్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఇప్పుడు ఈ భామ‌ బీటౌన్ లో సంద‌డి చేస్తోంది. ఉద‌యాన్నే ఫిట్నెస్ రాగాలు ఆల‌పించ‌డం ఈ అమ్మ‌డికి అల‌వాటు. అలా మార్నింగ్ సూర్య‌ర‌శ్మిలో యోగా మోడ్‌లో కూర్చున్న ర‌కుల్‌.. ఫ్యాన్స్ కు మాంచి కొటేష‌న్ కొట్టింది.

‘జీవితంలో ప్రతి ఒక్కరూ తమ కలలను అనుసరించాలని కోరారు. డ్రీమ్స్ ను ఫాలో అవ‌డం ద్వారా.. లైఫ్ ను మ‌రింత అందంగా మార్చుకోవాల‌’ని సూచించింది. ఒళ్లంతా పూల‌తోట విసించిందా? అన్న‌ట్టుగా ఉన్న ఫ్ల‌వ‌ర్ టాప్ ధ‌రించిన ర‌కుల్‌.. రిలాక్స్ మోడ్ లో జీవితాన్ని ధ్యానిస్తోంది. ఈ న్యూ ఫొటోతోపాటు న్యూ కొటేష‌న్ కూడా నెటిజ‌న్ల‌ను అట్రాక్ట్ చేస్తోంది.

ఈ అమ్మడు నటించిన అప్ కమింగ్ మూవీ ‘మేడే’. అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని దేవ్‌గన్ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రాబోయే ‘థాంక్ గాడ్’ చిత్రంలో కూడా అజయ్ తోనే జోడీ కడుతోందీ బ్యూటీ. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా నటిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ మూవీ తెరకెక్కనుంది.
Tags:    

Similar News