సెలబ్రిటీలకు షాక్ లివ్వడం కొత్తేమీ కాదు కానీ.. ఉన్నట్టుండి అందాల రకుల్ ప్రీత్ సింగ్ సడెన్ బాంబ్ పేల్చింది. తన ప్రియుడిని పరిచయం చేయడమే గాక అతడిని పెళ్లాడేస్తున్నానని ప్రకటించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ ఎవరా ప్రియుడు...? అంటే.. బాలీవుడ్ నిర్మాత తనయుడు.. హీరో జాకీ భగ్నాని.
రకుల్ ప్రీత్ సింగ్ తన 31వ పుట్టినరోజు సందర్భంగా అతడితో తన అనుబంధాన్ని ధృవీకరించారు. జాకీ భగ్నానీ తన ప్రేయసి రకుల్ రొమాంటిక్ పుట్టినరోజు పోస్ట్ లో తన ప్రేమను ఖాయం చేసాడు. అందమైన రొమాంటిక్ సందేశంతో పాటు ఈ స్పెషల్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపే స్వీట్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేశాడు. ఈ చిత్రంలో జాకీ .. రకుల్ చేతులు పట్టుకుని నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.
``మీరు లేకుండా రోజులు రోజులు అనిపించవు. మీరు లేకుండా అత్యంత రుచికరమైన ఆహారాన్ని తినడం సరదా కాదు. నాకు ప్రపంచం అంటే అత్యంత అందమైన ఆత్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపడం !!! ఈ రోజు మీ చిరునవ్వు వలె మెరుస్తూ ఉండండి. మీలాగే అందంగా ఉండండి. హ్యాపీ బర్త్ డే మై (హార్ట్ ఎమోజి) డార్లింగ్ రకుల్‌ప్రీత్`` అంటూ జాకీ భగ్నానీ విషెస్ తెలిపాడు. అనేక కౌగిలింతల ఎమోజీలను ఈ వ్యాఖ్యలకు జోడించాడు. రకుల్ అదే చిత్రాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి, ``థాంక్యూయు మై (హార్ట్ ఎమోజి)! ఈ సంవత్సరం మీరు నాకు అతిపెద్ద బహుమతి! నా జీవితానికి కలర్ జోడించినందుకు థ్యాంక్యూ. నా స్టాఫ్ ని నవ్వించినందుకు థ్యాంక్యూ.. నాన్ స్టాప్ థాంక్యూ యు యు! ! (హార్ట్ ఎమోజీలు) భగ్నానీ`` అంటూ రకుల్ ఎమోషనల్ అయ్యింది.
కృతి సనోన్ సహా సాటి నాయికలు అభిమానులు హార్ట్ ఈమోజీలతో స్పందించారు. వ్యాఖ్యల విభాగంలో `విజిల్` అని కృతి సనన్ రాసింది. టైగర్ ష్రాఫ్-, ఆయుష్మాన్ ఖురానా- జాక్వెలిన్ ఫెర్నాండెజ్- కాజల్ అగర్వాల్- పాత్రలేఖా -సోఫీ చౌదరి ఈ పోస్ట్ ని హార్ట్ ఎమోజీలతో ముంచెత్తారు.
రకుల్ రిలేషన్ షిప్ గురించి కొందరికి ముందే తెలుసు. వారిలో నటి లక్ష్మీ మంచు స్పందిస్తూ, ``మసెల్టోవ్! సరిగ్గా ఈ ప్రేమను బిగ్గరగా ఆటవికంగా జరుపుకోవాలి`` అని వ్యాఖ్యానించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఇలా వ్యాఖ్యానించారు. ``అయ్యో, .. నేను లక్కుతో ఏకీభవిస్తున్నాను !! ఇది సరైన సమయం ... మీ ఇద్దరికీ సంతోషం`` అంటూ వ్యాఖ్యల్ని జోడించారు.
రకుల్ ఒకప్పుడు తనకు ఎలాంటి భాగస్వామి కావాలనుకుంటుందో ఓ ఇంటర్వ్యూలో ఓపెనయ్యారు. ప్రముఖ వెడ్డింగ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ-``నా భాగస్వామికి జీవితంలో ఒక అభిరుచి.. మంచి ఉద్దేశ్యం ఉండాలి. నేను సన్నిహిత కుటుంబం నుండి వచ్చాను. సైనికుల కుటుంబ నేపథ్యంలో పెరిగాను. కాబట్టి అతను ఖచ్చితంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆస్వాధించే వ్యక్తిగా ఉండాలి`` అంటూ రకుల్ వ్యాఖ్యానించింది.
ఆమె వివాహ ప్రణాళికల గురించి మాట్లాడుతూ-``ఇది 100 మంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధంగా ఉండాలి. బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్రాధాన్యతనిస్తాను`` అని తెలిపారు.
రకుల్ హిందీ - తెలుగులో బిజీ స్టార్. బాలీవుడ్ లో అర్జున్ కపూర్ నటించిన సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రంలో కనిపించింది. ఇటీవలే తెలుగులో కొండపొలం రిలీజైంది. జాకీ భగ్నానీ కొన్ని విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఇప్పుడు నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. గతంలో జాకీ యంగిస్థాన్- ఫాల్తు- రంగ్రేజ్- మిత్రొన్ చిత్రాల్లో నటించాడు. కూలీ నెం-1, జవానీ జానేమాన్ తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు బెల్ బాటమ్ సహ నిర్మాతగా కొనసాగుతున్నారు.