ర‌కుల్ పూల్ సైడ్ స్పెష‌ల్ ట్రీట్ షురూ

Update: 2022-06-18 04:23 GMT
త‌న‌దైన‌ అందం క‌వ్వింతతో నిరంత‌రం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది ర‌కుల్. ఇక ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ట్రెండ్ లో ఇత‌ర నాయిక‌ల‌కు ధీటుగా వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఇంతుకుముందే మాల్దీవుల నుంచి స్పెష‌ల్ బికినీ ట్రీట్ కి సంబంధించిన ఫోటోల‌ను అంత‌ర్జాలంలో వైర‌ల్ చేసింది. ఇంత‌లోనే ఇప్పుడు మ‌రోసారి పూల్ సైడ్ ట్రీట్ కి సిద్ధ‌మైంది.

తాజాగా స్విమ్మింగ్ పూల్ ముందు ర‌కుల్ ఫోజులు కిరాక్ పుట్టిస్తున్నాయి. అలా ఫ్లోర‌ల్ టాప్ తో బికినీని క‌వ‌రప్ చేసిన ర‌కుల్ సింపుల్ స్మైల్ తో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

ఆల్మోస్ట్ ఆర‌డుగుల బుల్లెట్టులా క‌నిపించే ర‌కుల్ అలా ఒక్క లుక్కు ఇవ్వ‌గానే యూత్ క్లీన్ బౌల్డ్ అయిపోవాల్సిందే. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది.

త్వ‌ర‌లోనే ర‌కుల్ నిర్మాత జాకీ భ‌గ్నానీని పెళ్లాడ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట ప్ర‌స్తుతం స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. జాకీ భగ్నానీతో తన ల‌వ్ లైఫ్ గురించి ర‌కుల్ మాట్లాడుతూ... వ్య‌క్తిగ‌త జీవితం గురించి స్పందించకుండా ఉండటం నా పని.

నా వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు. ప్ర‌జ‌లు మేం ధరించే దుస్తుల గురించి.. చేసే ప‌నుల‌ గురించి వారికి నచ్చిన‌ విధంగా మాట్లాడతారు. కానీ అది మేం ప‌ట్టించుకోలేం. నేను మంచిని తీసుకుంటాను.. మిగిలిన వాటిని వదిలివేస్తాను" అని తెలిపారు.

టాలీవుడ్ లో కాలం క‌లిసి రాని ర‌కుల్ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ హీరోయిన్ గా నటించిన అటాక్ ఏప్రిల్ 1న విడుదలైంది. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అలాగే దేవ‌గ‌న్ తో క‌లిసి న‌టించిన రన్ వే 34 ఏప్రిల్ 29న విడుదలయ్యింది. ఈ మూవీ కూడా ఆశించిన రేంజుకు చేర‌లేదు.
Tags:    

Similar News