పోటాపోటీగా భామల ప్రమోషన్స్

Update: 2017-08-10 05:29 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ కావడానికి రెడీ గా ఉందంటే చాలు సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంటున్నారు. కొందరు తారలు సినిమా నటించడం వరకే తమ పని అన్నట్లు వ్యవహరిస్తుంటే ఇద్దరు స్టార్ హీరోయిన్లు మాత్రం సినిమా హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఒకరరు సక్సెస్ ట్రాక్ లో ఉండాగా మరొకరు భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

సౌత్ సినిమాలలో గత కొంత కాలంగా మంచి హిట్స్ తో దూసుకుపోతున్న కాజల్ - రకుల్ ప్రీత్ ఇప్పుడు వారి సినిమా ప్రమోషన్స్ తో తేగా బిజీగా గడుపుతున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న వారి సినిమాలు ఎలాగైనా తప్పకుండా చిత్ర యూనిట్ కి మంచి విజయాన్ని అందించాలని నిర్విరామంగా సోషల్ మీడియాలో మరియి ఎలక్ట్రానిక్ - ప్రింట్ మీడియా వంటి వాటిని అస్సలు వదలడం లేదు అలాగే ఏ ప్రాంతాలకు వెళ్లినా తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ.. సినిమాపై అంచనాలు రేపుతున్నారు. వీరిద్దరూ ప్రమోషన్స్ లో ఒకరినిను మించి ఒకరు పోటీ పడుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ "నేనే రాజు నేనే మంత్రి" సినిమా కోసం కష్టపడుతుండగా, రకుల్ "జయ జానకి నాయక" కోసం శ్రమిస్తోంది. రేపు ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై పాజిటివ్ టాక్ ఉండడంతో సినిమా రిలీజ్ తర్వాత కూడా మరింత గట్టిగా సక్సెస్ ప్రమోషన్స్ ని కూడా నిర్వహించేందుకు ఈ భామలు ఆలోచిస్తున్నారట. ప్రస్తుత రోజుల్లో సినిమా షూటింగ్ అయిపోగానే వేరే సినిమాల షూటింగ్స్ ఉన్నాయి అంటూ వెళ్లిపోయే తారలకంటే నిజంగా ఈ తారలు చాలా గ్రేట్  అంటున్నారు ఫ్యాన్స్.     
Tags:    

Similar News