కేవలం నటిస్తే సరిపోదు. సొంత గొంతుతో డబ్బింగ్ వినిపించి ఆడియెన్ ని మెస్సరైజ్ చేస్తేనే కిక్కు. అందుకోసం భాష రాకపోయినా మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు భామామణులు. నేటివిటీ టచ్ తో తెలుగులోనే మాట్లాడేస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సెట్ లో అలవాటైపోయాక, ఇక డబ్బింగు కోసం ల్యాబులకు కూడా వెళ్లిపోతున్నారు.
పొరుగు నుంచి వచ్చిన భామలంతా ఇలా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాకపోయినా తెలుగువారు తమని అభిమానించినందుకు తమవంతుగా వినోదంతో రంజింపజేయాలన్నది భామల ఆలోచన. ఐడియా బాగానే ఉంది కానీ ఇది ఎంతవరకూ వర్కవుటవుతుంది? భాష కాని భాషలో యాక్సెంట్ కుదురుతుందా? ప్చ్ .. గతంలో సమంత, తమన్నా ఇలానే ప్రయత్నించి మూతులు కాల్చుకున్నారు. లిప్ సింకవ్వదు. యాస, ప్రాస కుదరదు. ఏదో అయ్యిందిలే అన్నట్టే ఉంటుంది. లేటెస్టుగా ఈ జాబితాలోకి మరో ఇద్దరు భామలు చేరేట్టే ఉన్నారు.
ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకున్న రకూల్ ప్రీత్ సింగ్, స్టార్ స్టాటస్ కోసం పాకులాడుతున్న ప్రణీత ఇకముందు తెలుగు ప్రేక్షకులకు సొంత గొంతు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ భామలు హిస్టరీని రిపీట్ చేస్తారా? లేక కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తారా? చూడాల్సిందే.