పరిశ్రమలో ఎక్కువకాలం రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదు. సరైన టైమింగ్ ఉండాలి. కథల ఎంపికలో సమయస్ఫూర్తి ఉండాలి. వీటికి మించి కాంబినేషన్లు ఎంచుకునేటప్పుడు క్రేజ్ మీద కాకుండా కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి. ఇవి మిస్ అయినప్పుడే ఏ భాషలో ఉన్నా గ్రాఫ్ అంతంత మాత్రంగానే సాగుతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో మొన్నటిదాకా మంచి ఫామ్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లు అవకాశాలే లేక ఎదురుచూడటం దీనికి అద్దం పడుతోంది.
ఒకరు రాశి ఖన్నా. గత ఏడాది తొలిప్రేమలో వరుణ్ తేజ్ సరసన క్యూట్ లుక్ తో కొత్త మేకోవర్ తో పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఆకట్టుకున్న రాశి ఖన్నా ఆ సక్సెస్ ని వాడుకోలేకపోయింది. నితిన్ తో శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ అయ్యాక పెద్దగా ప్రాధాన్యం లేని తమిళ సినిమాల్లో చేస్తూ గందరగోళంలో పడిపోయింది. ఇప్పుడు ఆడుతున్న అంజలి సిబిఐలో తన పాత్ర చూస్తే జాలి కూడా కలుగుతుంది. చేతిలో టెంపర్ రీమేక్ అయోగ్యతో పాటు సైతాన్ క బచ్చా అనే మరో ఆరవ సినిమా తప్ప ఒక్క తెలుగు సినిమా ఆఫర్ లేదు
ఇక రెండో భామ రకుల్ ప్రీత్ సింగ్. మొన్నటిదాకా హవా నడిపించినా తర్వాత వరస పరాజయాలతో పాటు బాలీవుడ్ కోలీవుడ్ మోజు ఇక్కడి ఆఫర్లను పూర్తిగా దూరం చేసింది. పోనీ అక్కడ గెలిచిందా అంటే అదీ లేదు. గత ఏడాది ఐయారి షాక్ ఇచ్చింది. అజయ్ దేవగన్ లాంటి ఏజ్ బార్ హీరోతో దేదే ప్యార్ దే అనే సినిమాలో చేస్తోంది. మార్జవాన్ అనే మూవీ ఉంది కానీ అందులో క్రికెట్ టీమ్ అంత స్టార్లు ఉన్నారు. సో రకుల్ ప్రాధాన్యతను ఈజీగా గెస్ చేయొచ్చు.
ఇక కొద్దో గొప్పో ఆశలు పెట్టుకున్న దేవ్ బంపర్ డిజాస్టర్ కావడంతో మరో షాక్. సూర్య ఎన్జికెలో ఉంది కానీ ట్రైలర్ చూస్తే సాయి పల్లవి హవానే ఎక్కువ కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుకు దూరమై ఈ ఇద్దరు భామలు కెరీర్ ని క్లైమాక్స్ కు తెచ్చుకున్నట్టే ఉంది. స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఓ బ్లాక్ బస్టర్ పడాలి. లేదంటే ఏజ్ ఓల్డ్ హీరోలతో సర్దుకోకతప్పదు