ఇప్పుడు బాలీవుడ్ లో నీరజ్ పాండే సినిమా అంటే చాలు.. ఒక రకమైన ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ దేశ భక్తి చుట్టూ తిరుగుతూ.. మిలటరీలో ఆఫీసర్ల మధ్య పచారీలు చేస్తూ.. భలే ఆసక్తికరంగా ఉంటాయి. వెడ్నెస్ డే లాంటి షాకింగ్ థ్రిల్లర్ తీసినా.. అలాగే బేబి వంటి సీరియస్ యాక్షన్ సినిమా తీసినా.. అందులో మిలిటరీ ట్రీట్ అలాగే దేశభక్తి అదిరిపోయింది. ఇప్పుడు 'అయ్యారీ' అంటూ ఒక సినిమాతో వస్తున్నాడు.
మిలటరీలో పనిచేసే చాలా తెలివైన మేజర్ (సిద్దార్ద్ మల్హోత్రా).. కొన్ని కారణాల రిత్యా మిలిటరీ నుండి బయటకు వెళిపోయి.. లండన్ లో ఏదో చేస్తుంటాడు. అతడ్ని వెతికిపట్టుకోవాలని ఇప్పుడు అతని పై అధికారి (మనోజ్ బాజ్ పాయి) ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ ఏం జరిగింది అనేదే అసలు కథ. ఈ సినిమా అంతా ఒకెత్తయితే.. ఇందులో సిద్దార్ధ్ గాళ్ ఫ్రెండ్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తోంది. అమ్మడు ట్రైలర్లో కేవలం ఒక్క షాటులో మాత్రమే కనిపించినా.. అక్కడ బాలీవుడ్లో అమ్మడికి ఇది రెండో సినిమా. మరి ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
మిలటరీ నేపథ్యంలో రూపొందిన అయ్యారీ సినిమా.. జనవరి 26న విడుదలవుతోంది. ఒక ప్రక్కన అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ కు భారీగా హైప్ వస్తున్న వేళ.. ఇప్పుడు ఈ సినిమాకూడా మంచి పోటీని ఇచ్చేలా ఉంది.
Full View