ఆయనకు కాల్షీటు కుదరలేదంతే -రకూల్‌

Update: 2015-06-30 07:28 GMT
ఇటీవలి కాలంలో రకూల్‌ ప్రీత్‌పై ఓ రూమర్‌ పుట్టుకొచ్చింది. మహేష్‌ని కాదనుకుంది. మెగా హీరోల్ని కావాలనుకుంది. అందుకే ప్రిన్స్‌ కోసం కాల్షీట్లు కేటాయించలేదని ప్రచారమైంది. అయితే ఇదంతా వట్టి అసత్యపు ప్రచారమేనని అంటోంది రకూల్‌ ప్రీత్‌. మహేష్‌ని వద్దనుకోలా.. మెగా హీరోల్ని కావాలనుకోలేదని అంది.

అంతేనా కేవలం కాల్షీట్లు కుదరకపోవడం వల్లే మహేష్‌ని కాదనుకోవాల్సొచ్చింది. ఓ వైపు చరణ్‌తో షూటింగులో ఉన్నా. మరోవైపు ఎన్టీఆర్‌తో షూటింగ్‌కి షెడ్యూళ్లు ఖరారయ్యాయి. ఇంతలో మహేష్‌తో ఆఫర్‌ వచ్చింది. పైగా వాళ్లు జూలైలోనే కాల్షీట్లు కావాలన్నారు. అయితే ఆ నెలలో చరణ్‌, ఎన్టీఆర్‌లతోనే బిజీగా ఉంటా. అలాంటప్పుడు వేరే హీరోకి సమయం కేటాయించడం నావల్ల అవుతుందా? అడకత్తెరలో పోక చెక్కలా చిక్కుకుపోయా. అందుకే మహేష్‌ని కాదనుకున్నా.. అని చెప్పింది.

అయితే రకూల్‌ ఇంతలోనే మరో మెగా హీరోకి సంతకం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బన్ని హీరోగా బోయపాటి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా షెడ్యూళ్లు సెప్టెంబర్‌లో ఉంటాయి కాబట్టి ఏ సమస్యా లేదని చెప్పింది. అంతేనా నేను బన్నికి వీరాభిమానిని.. అని ఓ క్లూ కూడా ఇచ్చింది రకూల్‌. అదీ సంగతి.

Tags:    

Similar News