ఫోటో స్టోరి: బొంబాయిలో రకుల్ రచ్చ

Update: 2017-12-19 17:30 GMT
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో నార్త్ భామలు ఎక్కువగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సౌత్ లో ఎన్ని హిట్టు సినిమాలను చేసినా బాలీవుడ్ లో ఒక చిన్న అవకాశం వచ్చినా చెయ్యాలని చాలా ఆశపడుతుంటారు. ఆ తరహాలో అవకాశం రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అయితే ఈ రోజుల్లో ఆ తరహా అదృష్టాన్ని మన హీరోయిన్స్ చాలా ఈజీగా అందుకుంటున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ తరహాలో అడుగులు వేస్తోంది.

అమ్మడు ఇంతకుముందే 2014లో ఒకసారి యారియాన్ అనే సినిమాతో బి టౌన్ లో సందడి చేసింది. కొంచెం ఘాటుగానే కనిపించింది కూడా. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయారి అనే ఆ సినిమా ట్రైలర్ లాంచ్ రీసెంట్ గా జరిగింది. అయితే ఈ వేడుకలో అమ్మడు ఎవరు ఊహించని విధంగా కనిపించింది. చిన్న గ్లామర్ డ్రెస్ లో రకుల్ అందంగా నవ్వుతు కనిపించింది. వైట్ కలర్ డ్రెస్ లో అమ్మడి మొహం కూడా చాలా మెరిసిపోతోంది. గ్లామర్ డోసుతో బాగానే ఎట్రాక్ట్ చేసింది.

అదే తరహాలో మరోచోట సినిమా ప్రమోషన్ కు వెళ్ళినప్పుడు కూడా.. పింక్ కలర్ డ్రస్సులో ఇరగదీసింది. మిలామిలా మెరుస్తూ కాస్త మాస్ తరహాలో ఉన్నా కూడా.. అమ్మడు మాత్రం అటెన్షన్ అంతా తన మీదనే ఉండాలి అన్నట్లు బొంబాయిలో రచ్చ చేయడం మొదలెట్టింది.
Tags:    

Similar News