టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. 2017 కేసు.. అది కూడా తెలంగాణ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిన కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడం సంచలనాత్మకం అయింది. ఎక్సైజ్ శాఖ కేసులో ఈడీ విచారణ చేపట్టడం ఏంటని అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. అయితే మాదకద్రవ్యాల క్రయవిక్రయాల వ్యవహారంలో భాగంగా మనీల్యాండరింగ్ చట్టం కింద ఇప్పుడు ఈడీ కలుగజేసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్స్ ఆధారంగా కేసు నమోదు చేసి పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.
దగ్గుబాటి రానా - రకుల్ ప్రీత్ సింగ్ - పూరీ జగన్నాథ్ - చార్మీ కౌర్ - రవితేజ - ముమైత్ ఖాన్ - నందు - నవదీప్ - తరుణ్ - తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్ - ఓ క్లబ్ జనరల్ మేనేజర్ లకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరందరినీ కేవలం సాక్షులుగా మాత్రమే పిలిచినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే 2017 టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు లేదు. సిట్ విచారించిన సెలబ్రిటీలలో కూడా ఆమె లేదు. అలాంటిది ఇప్పుడు రకుల్ ని ఇందులో ఎందుకు ప్రస్తావించడం ఆలోచింపజేస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెకు సమన్లు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఎన్సీబీ ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. అలానే ఇందులో రకుల్ ప్రమేయం లేదని కూడా కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఉన్నట్టుండి నాలుగేళ్ళ క్రితం నాటి డ్రగ్స్ కేసు వ్యవహారంలో స్టార్ హీరోయిన్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ కేసుతో సంబంధం ఎలా ఉందో అనే విషయాలపై ఈడీ విచారణ ప్రారంభమైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.