పెటా.. బ్లూ క్రాస్ అనగానే ఇన్నాళ్లు అక్కినేని అమల- త్రిష- అనుష్క- అమలాపాల్ లాంటి నటీమణులే గుర్తొచ్చారు. కానీ ఇకపై అక్కినేని హీరోయిన్.. `మన్మథుడు 2` ఫేం రకుల్ ప్రీత్ పేరు కూడా వినాల్సి వస్తోంది. రకుల్ ఈ ఏడాది(2020) ఆరంభంలోనే శాకాహారిగా మారిపోయి మాంసాహారాన్ని త్యజించింది. అప్పటినుంచి ఇప్పటికి ఎన్నో మార్పులు. మునుపటితో పోలిస్తే రకుల్ చాలా వరకూ బరువు తగ్గి కనిపిస్తోంది. తాజా సన్నజాజి లుక్ పూర్తిగా శాఖాహారంతోనే సాధ్యమైందట.
అంతేనా.. పర్యావరణానికి హాని కలిగించకూడదని అమాయక జీవాల్ని చంపవద్దని ఈ అమ్మడు సెలవిస్తోంది. అయితే.. తాను ఏం చేసినా అది పర్యావరణ హితం అని చెప్పేందుకు ఇప్పుడు ఏకంగా పెటాతో చేతులు కలిపింది. తాజాగా పెటా అంబాసిడర్ రకుల్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. తాజా ఫోటోషూట్ లో రకుల్ వన్నె చిన్నెల అందాలకు క్యాలిఫ్లవర్ అడ్డు అంతే! ఏదేమైనా రకుల్ చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చాల్సిందే. గతంలో ఎందరో అందగత్తెలు పెటాకు ఈ తరహా ప్రచారం చేశారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పలువురు కథానాయికలు పెటా కోసం అందాల్ని చిందించే ఫోటోషూట్లలో పాల్గొన్నారు. ఇతరుల్లానే రకుల్ కూడా వేడి పెంచింది.
జంతువుల్ని చంపి తినడం.. పెంపుడు కోళ్లను తినడం కూడా కేవలం మాంసం అనే ప్రొటీన్ డైట్ కోసమేనని సెలవిచ్చిన రకుల్.. తాను మాత్రం శాఖాహారిగా మారాక మంచి రిజల్ట్ చూశానని తెలిపింది. ఇక అమాయక ప్రాణులు ప్రాణభయంతో మనిషిని చూసి పరిగెత్తుతాయని ఆవేదన చెందింది. ఇదొక్కటేనా తాను శాఖాహారిగా మారాక వ్యక్తిగతంగా మరింత తేలికపడ్డానని రకుల్ తెలిపింది. నా శక్తి స్థాయిలు ఎంతో మారాయి. నేను శాకాహారిగా మారేవరకూ ఆ మార్పు నాకు తెలియదు. కానీ ఇది గొప్పదని నేను భావిస్తున్నాను! ఈ మార్పు చాలా బాగుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తింటున్నా. ఇది మీ గట్ మీద ఆధారపడి ఉన్నది. ప్రయోజనకరమైనది. కనీసం 15 - 20 రోజులు శాఖాహారం ప్రయత్నించి చూడండి. రిజల్ట్ మీరే చూస్తారు`` అని కోరింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా కోసం రకుల్ అంబాసిడర్ అవతారం ఎత్తింది. ఇకపోతే లాక్ డౌన్ ఎత్తేశారు కాబట్టి ఇకపై భారతీయుడు 2 షూటింగులో రకుల్ పాల్గొననుంది. అటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు పలు క్రేజీ చిత్రాలకు సంతకం చేసిన సంగతి తెలిసిందే.