దక్షిణాదిన విజయశాంతి తర్వాత ఆ తరహాలో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న నటి నయనతార. ఆమెను ఇప్పుడందరూ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. అలాంటి నటితో తనకు పోలికేంటి అని ఆశ్చర్యపోయింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్.. ఇటీవలే ‘స్పైడర్’ సినిమాతో తమిళంలోనూ అడుగుపెట్టింది. ఆ సినిమా అంతగా ఆడకపోయిన్పటికీ తాజాగా కార్తి సరసన రకుల్ నటించిన ‘ధీరన్ అధికారి ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకి) విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఆమె ఇంకో రెండు సినిమాల్లో కూడా నటిస్తోంది. మరి భవిష్యత్ నయనతార కావాలనుకుంటున్నారా అని అడిగితే అంత సీన్ లేదని రకుల్ అంది.
‘‘నయనతారకు.. నాకు చాలా తేడా ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయింది. ఒక సినిమాను తానే ముందుకు తీసుకెళ్లగల సత్తా నయన్ సొంతం. అందరూ నయనతార అవుదామనుకుంటే కుదరదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే అనుభవం రావాలి. అందుకు చాలా టైం పడుతుంది. నేను ఇంకా భిన్నమైన పాత్రలు చేయాలి. ఇండస్ట్రీలో చాలా దూరం ప్రయాణించాలి. అప్పుడు తప్పకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ట్రై చేస్తాను. నయనతార నటించిన ‘ఆరమ్’ సినిమాను నేనింకా చూడలేదు. తెలుగులో రిలీజ్ అయితే తప్పకుండా చూస్తాను’’ అని రకుల్ తెలిపింది. ప్రస్తుతం తాను హిందీలో ‘అయ్యారి’ అనే సినిమా చేస్తున్నానని.. తమిళంలో కార్తితో ఇంకో సినిమా ఉంటుందని.. మహేష్.. సూర్య సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయని రకుల్ వెల్లడించింది.