ఆయ‌న కండిషన్ల‌కు ఊపిరాడ‌లేదు!

Update: 2019-05-26 13:18 GMT
సూర్య హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఎన్‌జీకే ఈనెల 31న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హైద‌రాబ‌ద్ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ అయ్య బాబోయ్ అనిపించే సంగ‌తులే చెప్పింది. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ తో ఆన్ లొకేష‌న్ ఎలా ఉంటుందో ఈ అమ్మ‌డు వ‌ర్ణించిన తీరు మీడియాకే బిగ్ షాకిచ్చింది.

ర‌కుల్ మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ నా కెరీర్ లో ఎంతో స్పెష‌ల్. ఆయ‌న‌తో ప‌ని చేస్తే న‌ట‌న ప‌రంగా బోలెడ‌న్ని నేర్చుకోవ‌చ్చ‌ని అర్థ‌మైంది. ముఖ్యంగా సెట్స్ లో ఆయ‌న పెట్టే కండిష‌న్ల‌లో న‌టించేందుకు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల్సి వ‌చ్చేది. అస‌లు ఎలాంటి కండిష‌న్లు పెడ‌తాడు? అన‌డిగితే.. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌టి లేదా న‌టుడు ఎవ‌రైనా అస‌లు న‌టించేప్పుడు రెప్ప వేయ‌కూడ‌దు. బ్లింక్ అయితే స‌హించ‌రు. ఊపిరి గ‌ట్టిగా తీసుకోకూడ‌దు. దాని వ‌ల్ల ఎమోష‌న్ చెడుతుంది. షాట్ అయిపోయాక రెండు నిమిషాలు అలానే ఉండాలి. ఓకే అన్న త‌ర్వాత ప‌క్క‌కు పోవ‌చ్చు. ఇక సీన్ సీన్ మ‌ధ్య ఆగి అలా ఉండాలి. ఇద్ద‌రు న‌టులు న‌టించేసి వెళ్లిపోకూడ‌దు. ఎక్కువ మూవ్ మెంట్ చేయొద్దు. క‌ళ్ల‌తోనే న‌టించాలి. క‌ళ్ల‌తోనే మాట్లాడాలి.  ఎక్స్ ప్రెష‌న్ అయ్యాక కాస్తంత‌ ఆగి పాస్ ఇచ్చి వెళ్లాలి. ఎమోష‌న్ ఎక్క‌డా త‌గ్గ‌డానికి లేద‌ని చెబుతాడు. ప్ర‌తి ఆర్టిస్టుకు న‌టించే స్కోప్ ఇస్తాడు. అత‌డి ప్ర‌తి సినిమాలో అన్ని పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. ప్ర‌తి పాత్ర‌లో ఎమోషన్ కావాల‌న్న‌ది ఆయ‌న రూల్.. అంటూ చ‌క‌చ‌కా సెల్వ ప‌ని తీరు గురించి... కండిష‌న్ల గురించి చెప్పేసింది.

అదొక్కటేనా.. అస‌లు షూటింగ్ చేస్తున్నంత సేపూ అస్స‌లు క్లాప్ మొహ‌మే చూడ‌లేదుట‌. సెల్వ‌కు అది న‌చ్చ‌ద‌ని ర‌కుల్ చెప్పింది. క్లాప్ ని చూస్తే ఆర్టిస్టు డిప్రెష‌న్ లోకి వెళ్లిపోతార‌న్న ఫీలింగ్ ఆయ‌న‌ది. నా వ‌ర‌కూ అయితే నేను సెట్స్ లో క్లాప్ అన్న‌దే చూడ‌లేదు.. అని ర‌కుల్ తెలిపింది. అదంతా స‌రే.. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లో మీ రోల్ ఏంటి? అంటే .. ఇందులో తాను కూడా ఒక పొలిటీష‌న్ తో క‌లిసి ప‌ని చేసే పాత్ర‌లో న‌టించాన‌ని చెప్పింది ర‌కుల్. ఇందులో సాయి ప‌ల్ల‌వి కూడా పోటీ ప‌డి న‌టించింది. త‌ను బెస్ట్ స్టార్ అని చెప్పింది. సాయిప‌ల్ల‌వితో నాలుగైదు కాంబినేష‌న్ సీన్లు ఉంటాయ‌ని వెల్ల‌డించింది.


Tags:    

Similar News