బ్రేక్ గురించి రకుల్ ప్రీత్ ఏమంటోందంటే

Update: 2016-12-07 06:22 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి స్టార్ స్టేటస్ వచ్చేసినట్లే. చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న బిజీ భామను.. స్టార్ అనడానికి అభ్యంతరాలు అవసరం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో రకుల్ నటించిన ధృవ.. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. తమిళ్ లో తన ఫేవరేట్ మూవీ తని ఒరువన్ కాగా.. ఆ మూవీ రీమేక్ లో తనను తీసుకోవడం.. చెర్రీ లాంటి కోస్టార్ తో వరుసగా రెండోసారి చేసే అవకాశం రావడం మాత్రం మర్చిపోలేనని అంటోంది.

అయితే.. యాక్టింగ్ విషయంలో ఈమెకు బోలెడన్ని డౌట్స్ ఉంటాయట. తను బాగా చేశానా లేదా అనే డౌట్ పట్టి పీడిస్తూ ఉంటుందట. అందుకే దర్శకుడితో.. మీకు ఓకే అయితే నాకు ఓకే అని చెప్పేస్తూ ఉంటుందట రకుల్. ఇక టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కదా రకుల్ నువ్వు.. అలసట లాంటివి రెస్ట్ తీసుకోవాలని అనిపించదా అని అడిగితే 'చేయాలని అనుకుంటున్నది చేస్తే అలాంటి ఫీలింగ్ రాదు. మేక్ ఏ లైఫ్ దట్ యు డోంట్ నీడ్ ఏ వెకేషన్ ఫ్రం (బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేని జీవితాన్ని నిర్మించుకో) అన్నది నా హెడ్ లైనర్. ట్విట్టర్ లో కూడా రాసి ఉంటుంది' అని చెప్పింది రకుల్.

'నాకు నచ్చని పని ఏదైనా అంటే.. సాఫ్ట్ వేర్ లాంటిది చేస్తే అప్పుడు బోర్ ఉంటుంది. బ్రేక్ అవసరం ఉంటుంది. కానీ 15 రోజులకు ఓసారి అయినా 1 రోజు బ్రేక్ తీసుకుంటా. యాక్ట్రెస్ గా హెయిర్.. స్కిన్.. లాంటివన్నీ చూడాలి కదా' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News