రకుల్ కి ముద్దు ఓకే.. కానీ నిర్మాతలే..

Update: 2017-05-31 05:34 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వరుస పెట్టి సినిమాలు చేయడమే కాదు.. క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడంతోపాటు.. వరుసగా హిట్స్ కొట్టేస్తోంది రకుల్. రీసెంట్ గా చైతుతో కలిసి రా రండోయ్ వేడుక చూద్దాం అంటూ సక్సెస్ సాధించిన ఈ భామ.. దసరాకి మహేష్ బాబు మూవీ స్పైడర్ లో హీరోయిన్ గా కనిపించనుంది.

కోలీవుడ్ లో కార్తి తో కలిసి ధీరన్ అధికారం ఒండ్రు అనే ముూవీలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. సినిమాలకు గ్లామర్ చాలా ముఖ్యం అంటోంది. 'సినిమాల నుంచి గ్లామర్ ను విడిగా చూడలేం. హీరోయిన్స్ అలా నటిస్తేనే ఫ్యాన్స్ చూస్తారు. గ్లామరస్ డ్రెస్సుల్లో హీరోయిన్లను దేవతలుగా చూపించినా జనాలు చూస్తారు. అలాగే ముద్దు సీన్లలో నటించడం కూడా తప్పేమీ కాదు. స్టోరీకి అవసరం అయితే అలాంటివాటిలో నటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే.. అవి అశ్లీలంగా ఉండకూడదు.. ప్రచారం కోసం ఆ సీన్స్ ఇరికించకూడదు అన్నవి నా కండిషన్స్' అని చెప్పింది రకుల్.

రకుల్ పాప చెప్పిన ముద్దు కబుర్లు బాగానే ఉన్నాయ్ కానీ.. ఈమె లిప్ లాక్ చేసిన సినిమాలు పేలిపోయాయి. బాలీవుడ్ మూవీ యారియాలో పేద్ద మూతి ముద్దు పెట్టింది. కిక్2 లో రవితేజకు స్ట్రాంగ్ కిస్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు పేలిపోయాక.. రకుల్ ను లిప్ లాక్ చేయమని అడిగే ధైర్యం ఏ దర్శకుడు.. నిర్మాత చేయడం లేదన్నది వాస్తవం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News