టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను అభిమానించే వారు చాలా మందే ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా చాలా ఏళ్లుగా మలయాళ అభిమానులు కూడా అల్లు అర్జున్ కు ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల మాదిరిగానే మలయాళ అభిమానులు కూడా బన్నీని విపరీతంగా ఆరాధిస్తూ.. అక్కడ స్టార్ హీరోల స్థాయిలో అభిమానిస్తూ ఉంటారు.
కొన్నాళ్ళ వరకు తెలుగు రాష్ట్రాల్లో మరియు కేరళలో మాత్రమే అభిమానులను కలిగి ఉన్న అల్లు అర్జున్ గత కొన్నాళ్లుగా ఉత్తరాదిన తన డబ్బింగ్ సినిమాలతో శాటిలైట్ ద్వారా అభిమానులను సొంతం చేసుకున్నాడు. పుష్ప తో ఉత్తర భారతంలో బన్నీకి మరింత అభిమానులు పెరిగారు. సాధారణ జనాలు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా బన్నీకి ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు.
బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తో పాటు ఇంకా ఎంతో మంది స్టార్స్ కూడా అల్లు అర్జున్ డాన్స్ ను అభిమానిస్తున్నాం.. ఆయన నటనను స్టైలిష్ లుక్ ను ఇష్టపడుతున్నాం అంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరోయిన్ కూడా చేరింది. రకుల్ ప్రీత్ సింగ్ తనకు అత్యంత అభిమాన నటుడు అల్లు అర్జున్ అంటూ పేర్కొంది.
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ తో కలిసి నటించిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు చేరబోతుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ జాబితాలో కూడా ఈ అమ్మడు చేరినట్లుగా తాజాగా ఆమె చేసిన ట్వీట్ తో క్లారిటీ ఇచ్చినట్లుగా అయ్యింది.
ఇక బన్నీ సినిమా విషయానికి వస్తే పుష్ప విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా సోషల్ మీడియాలో ఏ మాత్రం సందడి తగ్గలేదు. మరో వైపు పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన పుష్ప 2 ను అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.