కెరీర్ పరంగా తీవ్రమైన సందిగ్ధతతో ఉంది రకుల్ ప్రీత్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టాటస్ ని అందుకుని ఉన్నట్టుండి ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయింది. మహేష్ తో స్పైడర్.. నాగార్జునతో మన్మధుడు 2 ఊహించని డిజాస్టర్స్ గా నిలవడం ఈ అమ్మడికి పెద్ద మైనస్ అయ్యింది. ఇటీవల అసలు తెలుగులో ఆఫర్లు ఏవీ లేవు.
ఆ క్రమంలోనే బాలీవుడ్ కి వెళ్లి అక్కడ జాన్ అబ్రహాం సరసన ఎటాక్ అనే చిత్రంలో నటిస్తోంది. అర్జున్ కపూర్ సరసనా ఓ చిత్రంలో కనిపించనుంది. అలాగే వేరక హిందీ చిత్రం ఏప్రిల్ లో సెట్స్ కెళ్లనుందట. ఇక బాలీవుడ్ వెళ్లాక రకుల్ లుక్ కూడా అమాంతం మారిపోయింది. అక్కడ కరీనా రేంజులో జీరో సైజ్ కోసం బాగానే పాకులాడింది. అయితే జీరో సైజ్ ప్రయత్నం వికటించి ఉన్న అందం కాస్తా చెడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక జీరో సైజ్ .. స్లిమ్ లుక్ ని యథావిధిగా కొనసాగించాలంటే నిరంతరం ఏదో ఒక సాధన చేస్తూనే ఉండాలి. యోగ- జిమ్ రెగ్యులర్ గా తప్పనిసరి. ఇదిగో ఇలా తలకిందులుగా శీర్షాసనం వేసింది రకుల్. తన కోచ్ సమక్షంలోనే ఈ ఫీట్ వేసింది. తలను నేలపై ఉంచి కాళ్లను పైకెత్తి ఏ రేంజులో శ్రమిస్తోందో చూస్తున్నారుగా. ప్రస్తుతం ఈ వీడియో యువతరంలో జోరుగా వైరల్ అయిపోతోంది. ఇక కెరీర్ తలకిందులైంది. ఇప్పుడిలా జీవితమూ తలకిందులైందా? అంటూ వేడెక్కించే కామెంట్లు పెడుతున్నారు యూత్. అ వీడియోను షేర్ చేసిన రకుల్ .. ఏమందంటే.. ``మెడ భాగం నుంచి హెడ్ స్టాండ్ వరకు అలా ఉండడం వల్ల మీరు మీ భయాలను అధిగమించవచ్చు. ఆ తర్వాత మీరు అనుభవించే సుఖం ఎంతో బావుంటుంది. దీనిని సుఖ యోగా అని కూడా పిలుస్తారు. శారీరకంగా - మానసికంగా # strongisthenewsexy #fitnessisfun `` అనే వ్యాఖ్యను జోడించింది. అయితే ఇలాంటివి సహాయం లేకుండా ఇంట్లో ప్రయత్నించవద్దు.
రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా `దేదే ప్యార్ దే`(2019) లో నటించింది. టబు- అజయ్ దేవ్‌గన్ - అలోక్‌నాథ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. మార్జావాన్ లో సిధార్థ్ మల్హోత్రా -తారా సుతారియాతో కలిసి కనిపించింది. సిమ్లా మిర్చితో ఆమె డిజిటల్ అరంగేట్రం చేసింది. దీనిలో ఆమె రాజ్ కుమార్ రావు - హేమ మాలినిలతో స్క్రీన్ ని పంచుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీ అవుతోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి