టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో కూడా నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అవకాశాలు లేక పోవడంతో తమిళంలో ప్రయత్నాలు చేసింది. అక్కడ ఒక మోస్తరుగా అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్ లు రాకపోవడంతో అక్కడ కూడా ఈమెకు అవకాశాలు కనిపించడం లేదు. దాంతో రకుల్ ఏ పాత్రను అయినా చేసేందుకు ఓకే చెబుతోంది. తాజాగా నాగార్జున 'మన్మధుడు 2' చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
యంగ్ హీరోయిన్స్ ఎవరు కూడా చేసేందుకు ఆసక్తి చూపని ఆ పాత్రకు ఈ అమ్మడు ఓకే చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. నాగార్జునకు భార్య పాత్రలో రకుల్ కనిపించబోతుందట. కాస్త ఏజ్డ్ పాత్రలో రకుల్ నటించబోతుందని, అవకాశాలు లేకపోవడంతో ఆ పాత్రనైనా చేసేందుకు కమిట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు చేతిలో సినిమాలేవి లేవు, దాంతో పాత్ర ఏదన్న విషయం పక్కన పెట్టి నటించేందుకు కమిట్ అయ్యింది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందబోతున్న 'మన్మధుడు 2' చిత్రం అతి త్వరలో పట్టాలెక్కేందుకు సిద్దం అయ్యింది. నాగార్జునకు ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆనమ్మకంతోనే ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ లో నాగార్జున నిర్మించబోతున్నాడు. ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లో జరుపబోతున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.