టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా తెరకెక్కుతుంది. అయితే లాక్ డౌన్ లోనే తన తదుపరి ప్రాజెక్ట్ లకు కూడా సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా తర్వాత తన కెరీర్‌కు విలన్‌గా 'జయం' మూవీతో పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ డైరెక్షన్‌లో 'అలిమేలుమంగ వేంకటరమణ' అనే సినిమాను చేసేందుకు గోపి రెడీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరలో తేజతో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో వేంకట రమణ క్యారెక్టర్ ను గోపీ చేయనుండగా, అలిమేలు మంగ పాత్రను ఎవరు చేస్తారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ క్యారెక్టర్‌కు సంబంధించి ఫిల్మ్‌నగర్‌లో ఇద్దరి పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి డైరెక్టర్ తేజ ఫస్ట్ కాజల్‌నే తీసుకుందామని భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
అలివేలు పాత్ర కోసం కాజల్ గానీ, అనుష్క గానీ కనిపిస్తారని ప్రచారం జరిగింది. కాజల్ ఈ సినిమాలో నటించడానికి ముందుకొచ్చినా, తేజ మరో ఆప్షన్ కోసం వెదుకుతున్నారట. అనుష్క పేరు అయితే రూమరేనట. తేజ దృష్టిలో ఇద్దరు యంగ్ హీరోయిన్లు ఉన్నారట. ఒకరు రకుల్ ప్రీత్, మరొకరు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి డేట్లు ఇప్పుడు దొరకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తన చేతిలో `విరాట పర్వం` సినిమా ఉంది. రకుల్ ఏమో తెలుగు సినిమాలు లేక ఎదురు చూస్తుందట. అందుకే అన్ని విధాలా రకుల్ అయితే బెటర్ అని తేజ భావిస్తున్నారట. ఇంతకు ముందు గోపీచంద్ – రకుల్ కలిసి ‘లౌక్యం’లో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. అలాగని రకుల్ తో మళ్లీ హిట్ ఇస్తుందని సెంటిమెంట్ గా బెస్ట్ ఆప్షన్ అని తేజ టీమ్ అనుకుంటున్నారట. సాయిపల్లవి ఓకే అంటే గనక రకుల్ కి మళ్లీ తెలుగులో గడ్డుకాలమే అని చెప్పాలి.