టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - నటి ఛార్మీ కౌర్ లను విచారించారు. ఈ క్రమంలో నేడు శుక్రవారం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. రకుల్ తన చార్టెడ్ అకౌంటెంట్ - లాయర్ - మేనేజర్ లతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు.
వాస్తవానికి ఈడీ నోటీసుల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6న విచారణకు హజరుకావాల్సి ఉంది. అయితే షూటింగులతో బిజీగా ఉండటం కారణంగా ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని.. ఈరోజు సెప్టెంబర్ 3న విచారణకు హాజరవుతానని రకుల్ మెయిల్ ద్వారా అధికారులను కోరింది. దీనికి ఈడీ అనుమతి ఇవ్వడంతో రకుల్ నేడు విచారణకు వచ్చారని తెలుస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఓ ఫైల్ పట్టుకొని తన టీమ్ తో కలిసి ఈడీ ఆఫీస్ కు వచ్చిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈరోజు ఉదయం 10:30 గంటలకి విచారణకు రావాల్సిందిగా అధికారులు ఈడీ నోటీసులో పేర్కొనగా.. ఈడీ అధికారుల కంటే ముందే ఉదయం గం.9:10 నిమిషాలకి రకుల్ ఆఫీస్ కు చేరుకున్నారు. మీడియా హడావిడి లేకుండా చూసుకోడానికే రకుల్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి 2017లో ఎక్సైజ్ శాఖ జరిపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. కానీ ఇప్పుడు ఈడీ ఆమెకు సమన్లు జారీ చేయడం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అయితే డ్రగ్ పెడ్లర్ కెల్విన్ సమాచారం మేరకు రకుల్ కు కూడా మనీలాండరింగ్ వ్యవహారంలో సంబంధం ఉందనే కోణంలో ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోరకుల్ బ్యాంక్ ఖాతాల లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్స్ ని ఈడీ పరిశీలించనుంది. కెల్విన్ కు రకుల్ అకౌంట్స్ నుంచి ఏమైనా ట్రాన్సక్షన్స్ జరిగాయా అని ఆరాలు తీయనుంది. ఇదిలా ఉంటే గతేడాది బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రకుల్ ప్రీత్ సింగ్ ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.