వందలాది మంది అమ్మాయిల మధ్య రామ్‌..!

Update: 2022-10-03 05:46 GMT
యంగ్‌ హీరో రామ్‌ గత చిత్రం ది వారియర్ పై చాలా నమ్మకం పెట్టుకుని నటించాడు. సినిమా విడుదల సమయంలో కూడా ఆయనలో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. లింగు స్వామిని రామ్‌ మళ్లీ అభిమానులను నిరాశ పర్చాడు. దాంతో ఈసారి తప్పు జరగకూడదు అనే ఉద్దేశ్యంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా రామ్‌ ధీమాతో ఉన్నాడు. ఇప్పటికే రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో రామ్‌ ఉన్నాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్‌ మరియు హీరో పాత్ర గురించి లీక్‌ వచ్చింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్‌ ఒక అమ్మాయిల కాలేజ్ లో లెక్చరర్ గా కనిపించబోతున్నాడట. కుర్ర లెక్చరర్‌ అంటే పడి చచ్చే స్టూడెంట్స్ చాలా మందే ఉంటారట ఆ కాలేజ్ లో.. అక్కడ మనోడి సందడి ఎలా ఉంటుంది అనేది చూడాలి.

బోయపాటి సినిమా అంటే ఓ రేంజ్ లో యాక్షన్ ఉంటుంది. అఖండ సినిమా తర్వాత బోయపాటి సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బోయపాటి తో సినిమా అంటే ఆయనకు చాలా పాజిటివ్‌ విషయం. సినిమా కాన్సెప్ట్‌ వింటూ ఉంటే రామ్‌ కి తగ్గట్లుగా ఉండేలా ఉంది. కనుక ఈ సినిమా సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News