నీకు పడిపోతున్నా.. -యాంకర్ ఝాన్సీ

Update: 2015-12-22 04:56 GMT
సినిమా ప్రోగ్రామ్స్ కి టీవీ తారలు యాంకరింగ్ చేయడం.. టాలీవుడ్ లో ఓ కల్చర్. ఈవెంట్స్ ని రక్తి కట్టించడానికి ఈ యాంకర్స్ బోలెడన్ని కబుర్లు చెబుతుంటారు. ఇప్పుడున్న వారిలో.. యాంకర్ ఝాన్సీకి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో  బోలెడంత ఎక్స్ పీరియన్స్ ఉంది.

ఎనర్జీకి పర్యాయపదం లాంటి రామ్, మళయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ జంటగా నటించిన నేను.. శైలజ.. ఆడియో ఫంక్షన్ కు ఝాన్సీనే యాంకరింగ్ నిర్వహించింది. ఫంక్షన్ మొదటినుంచి చివరివరకూ ఎంతో ఉత్సాహంగా, తన మాటలతో వేడుక చేసింది ఈ యాంకర్. తెలుగు రాని హీరోయిన్ తో కబుర్లు చెప్పించింది. హీరో రామ్ కోసం ఆడియన్స్ గోల చేస్తుంటే కంట్రోల్ చేసింది. స్టేజ్ పై అందరూ మాట్లాడేలా తన ప్రతిభతో మెయింటెయిన్ చేసింది.

చివర్లో ఝాన్సీ అన్న మాట ఓ మాత్రం సెన్సేషన్ అయిపోయింది. "యాక్చువల్లీ ఐ యామ్ ఫాలింగ్ ఫర్ యూ రామ్" అనేసింది ఝాన్సీ. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక.. ఝాన్సీకి దగ్గరగా వచ్చి భుజంపై చెయ్యి వేసి మరీ "ఎంతో ఉత్సాహంగా ప్రోగ్రాం నిర్వహించారు.. ఝాన్సీగారికి థాంక్యు" అన్నప్పుడు ఈ యాంకర్ స్పందన ఇది. అఫ్ కోర్స్.. అనేశాక.. ఎంతబాగా యాక్ట్ చేశారో యాక్టర్ గా అంటూ కవర్ చేసేసి.. క్లోజ్ చేసేసింది లెండి.
Tags:    

Similar News