వరుస ఫ్లాపులతో సతమతమైన రామ్ కు గత ఏడాది మంచి సక్సెస్ అందించిన సినిమా ‘నేను శైలజ’. రామ్ తన శైలికి చాలా భిన్నంగా కనిపించాడు ఈ చిత్రంలో. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోరే నిర్మించాడు. ఈ ప్లెజెంట్ లవ్ స్టోరీ తర్వాత రామ్ మళ్లీ తన స్టయిల్లో చేసిన ‘హైపర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ‘హైపర్’ తర్వాత అదీ ఇది అనుకుని చివరికి కిశోర్ తోనే జట్టు కట్టడానికి నిర్ణయించుకున్నాడు రామ్. ఈ సినిమాకు కూడా రామ్ పెదనాన్నే నిర్మాత. ఈ చిత్రం ఉగాది సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకోవడం విశేషం.
ఈ సినిమా కోసం రామ్ తన లుక్ మార్చుకోవడం విశేషం. కండలు పెంచి.. గడ్డం పెంచి భిన్నంగా తయారయ్యాడు రామ్. ఈ చిత్రంలో రామ్ తో పాటు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హీరో శ్రీవిష్ణు ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ‘నేను శైలజ’ చిత్రానికి తన సంగీతంతో బలంగా నిలిచిన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికీ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ ‘‘ఇది సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న చిత్రం. ప్రతి క్యారెక్టర్ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ‘నేను శైలజ’ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/