బాలీవుడ్ రైట్స్ పై రామ్ చరణ్ పాగా

Update: 2018-02-21 08:31 GMT
తెలుగులో క్రేజీ ప్రాజెక్టులకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు డిమాండ్ బాగానే ఉంటోంది. కోట్ల కొద్దీ మొత్తాలు జస్ట్ హిందీ డబ్బింగ్ అండ్ శాటిలైట్ రూపంలోనే వస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో రామ్ చరణ్ హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే రంగస్థలం మూవీ హిందీ శాటిలైట్ తో రికార్డ్ సృష్టించిన చెర్రీ.. ఇప్పుడు తర్వాతి సినిమాతో తన రికార్డును తనే బద్దలు కొట్టేశాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రానికి.. హిందీ శాటిలైట్ జరిగిన తీరు చూసి టాలీవుడ్ అంతా ముక్కున వేలేసుకుంటోంది. ఏకంగా 22 కోట్ల రూపాయలకు డీల్ ఫైనల్ కావడం హైలైట్ అని చెప్పాలి. ఇంత పెద్ద మొత్తం గిట్టుబాటు కావడానికి ప్రస్తుతం చెర్రీ తన క్రేజ్ పెంచుకుంటున్న తీరును కారణంగా చెప్పవచ్చు. ధృవ సక్సెస్ తర్వాత చరణ్ రేంజ్ మారింది. రీసెంట్ గా రంగస్థలం టీజర్.. లిరికల్ సాంగ్ తర్వాత మరింతగా అంచనాలు పెరిగాయి.

రామ్ చరణ్ మార్కెట్ ఊపందుకుంటున్న తీరు.. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. హిందీ శాటిలైట్ రూపంలోనే ఇంత మొత్తం రాగా.. డిజిటల్ వెర్షన్ కు కూడా ఇంతే వచ్చే అవకాశాలున్నాయి. ఇక తెలుగు శాటిలైట్ మొత్తం కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. అంటే చరణ్ మూవీ చేస్తే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే 50 కోట్లు పక్కా అన్నమాట.
Tags:    

Similar News