#ఆచార్య .. బాస్ - చిన‌బాస్ ని ఒకే ఫ్రేమ్ లో చూస్తే పెద్ద పండ‌గే

Update: 2021-03-10 05:30 GMT
మెగాస్టార్ చిరంజీవిని తెలుగు సినీపరిశ్ర‌మ లెజెండ్ అని ప్ర‌క‌టించి సినీపెద్ద‌గా ఎంత‌గానో గౌర‌విస్తోంది. అంత‌కుమించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని .. ఏజ్ తో ప‌ని లేకుండా ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్న క‌థానాయ‌కుడిగా ఆయ‌న పేరు ఎప్ప‌టికీ సుస్థిరం. రీఎంట్రీలోనూ బాక్సాఫీస్ వ‌ద్ద బాస్ అని నిరూపిస్తున్నారు.

మెగాస్టార్ రాజ‌కీయాల్లోకి వెళ్లినా ఆయ‌న లెగ‌సీని ముందుకు న‌డిపించ‌డంలో వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డా ఫెయిల్ కాలేదు. ఆరంభం చిన్న‌పాటి త‌డ‌బాటు ఉన్నా.. ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్న అగ్ర హీరోల్లో అత‌డి పేరు స్థిరంగా ఉంది.

ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే మెగాభిమానుల‌కు పండ‌గే. ఇంత‌కుముందు మ‌గ‌ధీర‌- బ్రూస్ లీ లాంటి చిత్రాల్లో మెగాస్టార్ గెస్టుగా మాత్ర‌మే క‌నిపించారు. దానికే మెగాభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇప్పుడు ఆచార్య చిత్రంలో అంత‌కుమించి తండ్రి కొడుకుల ట్రీట్ మెగా ఫ్యాన్స్ ని ఎగ్జ‌యిట్ చేయ‌బోతోంది.

మే 13న ఆచార్య రిలీజ‌వుతోంది. ఆరోజు మెగాభిమానుల‌కు పెద్ద పండ‌గ అనే చెప్పాలి. ఇప్ప‌టికే చిరు-చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ గా ఈ మూవీపై హైప్ పీక్స్  కి చేరుకుంది. ఆ మేర‌కు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ డిమాండ్ హైలో ఉంద‌ని చెబుతున్నారు. ఆచార్యకు దాదాపు 120 కోట్ల మేర బిజినెస్ జ‌రుగుతోంద‌న్న‌ది ట్రేడ్ విశ్లేష‌ణ‌. ఇదంతా తండ్రి కొడుకుల‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యానే అని విశ్లేషిస్తున్నారు.

తండ్రి-కొడుకు ద్వయం కలిసి నటించడం తెలుగు సినిమా చరిత్రలో కొత్త మైలురాయి. ఒకే మూవీలో ఇద్దరు అగ్ర‌ తారలు పూర్తి స్థాయి పాత్రల్లో నటించ‌డం ఆచార్య‌కు ప్ర‌త్యేక‌మైన బూస్ట్ ఇచ్చింద‌ని చెప్పాలి. ఇక తండ్రి కొడుకులు ఇద్ద‌రు న‌ట‌న‌-డ్యాన్సులు- డైలాగ్ డిక్ష‌న్ .. ఇలా అన్ని కోణాల్లోనూ ఎంతో ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్న‌వారు. న‌వ‌ర‌సాల్ని సునాయాసంగా ప‌లికించ‌గ‌ల స‌మ‌ర్థులు. అందుకే పెద్ద తెర‌పై ఆచార్య రూపంలో ఒక గొప్ప అద్భుతం ఆవిష్కృత‌మ‌వుతుంద‌నే అంతా వేచి చూస్తున్నారు.

ఇక కొర‌టాల శివ లాంటి క్లాసిక్ రైట‌ర్ .. ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా పీక్స్ కి చేరుకున్నాయి. ఆచార్య చిత్రంలో అర్థం ప‌ర‌మార్థం సందేశం అనేవి ప్ర‌జ‌ల్లో హాట్  టాపిక్ గా మారాయి. క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని మించి చిరు ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు చ‌క్క‌ని సందేశంతో ఈ మూవీ హిస్ట‌రీలో నిలిచిపోతుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News