బ్రూస్ లీ సినిమా రిలీజైంది. క్రిటిక్స్ పరమ రొటీన్ అంటూ ఈ చిత్రాన్ని ఏకేశారు. కథ, కాకరకాయ లేకుండానే శ్రీనువైట్ల ఈ సినిమా తీసేశాడని విమర్శలొచ్చాయి. పరమ రొటీన్ గా అక్క - తమ్ముడు సెంటిమెంటుతో తెలుగు ప్రేక్షకులకు విసుగు తెప్పించారన్న విమర్శలొచ్చాయి. అయినా ఈ సినిమా ప్రమోషన్ విషయంలో చరణ్ ఏమాత్రం తగ్గడం లేదు. క్రిటిక్స్ నుంచి వచ్చిన కామెంట్లను పట్టించుకోకుండా తన వంతుగా ప్రమోషన్ లో తలమునకలుగా ఉంటున్నాడు.
ఈ సినిమాలో సిస్టర్ గా చేసిన హీరోయిన్ కృతి కర్భందతో కలిసి చరణ్ టీవీ చానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చాడు. అవన్నీ దసరా పండుగ సందర్భంగా దాదాపు ఓ నాలుగైదు ఛానళ్ళలో రానున్నాయి. బ్రూస్ లీ సినిమా అక్క-తమ్ముడు సెంటిమెంటు చుట్టూ తిరుగుతుంది. అందులో కృతి కర్భంద చరణ్‌కి సోదరిగా నటించింది. అందుకే ఈ ఇద్దరూ కలిసి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. అయితే బ్రూస్ లీ సినిమాకి బి,సి కేంద్రాల్లో కొంతవరకూ రిలీఫ్ ఇవ్వడానికే చరణ్ ఈ ట్రిక్ ప్లే చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి.
స్టంట్ మన్ గా అతడి యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ జనాలకు నచ్చుతాయి. అందుకే అక్కడ ఇంకా పట్టు బిగించాలన్న పట్టుదలతో ఇలా ప్రమోషన్ చేస్తున్నాడని అనుకోవచ్చు. కాని ఒక్కసారి బిలో యావరేజ్ టాక్ వచ్చేశాక.. ఎంతగా ప్రమోట్ చేసినా కూడా వర్కవుట్ అవ్వదు మరి. చూద్దాం బ్రూస్ లీ విషయంలో ఏమవుతుందో.. ఇకపోతే హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా మరోవైపు నుండి ప్రమోషన్ దంచేస్తోంది.