ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టకుండానే టాలీవుడ్ లోనే కాక జాతీయ స్థాయిలో సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్న రాజమౌళి మల్టీ స్టారర్ కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ హంగామా లేకుండా జరిగిపోతోంది. అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత దానయ్య ఇది వరకే ప్రకటించిన నేపథ్యంలో ముందు ఏ పార్ట్ తీస్తాడు ఎవరి ఎంట్రీ ముందు ఉంటుంది లాంటి విశేషాల పట్ల అభిమానులు యమా ఆసక్తిగా ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజమౌళి ముందు జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించే సీన్స్ ని తీయబోతున్నట్టు తెలిసింది.
సెప్టెంబర్ కంతా అరవింద సమేత వీరరాఘవ పూర్తయిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఒక నెల రోజులు ప్రమోషన్ కోసం అనుకున్నా ఆపై తారక్ ఫ్రీగా ఉంటాడు. అందుకే నవంబర్ లో యంగ్ టైగర్ పార్ట్ తో జక్కన్న రంగంలోకి దిగబోతున్నట్టు తెలిసింది. మరోవైపు రామ్ చరణ్ బోయపాటి శీను కాంబో సినిమా షూటింగ్ నవంబర్ కు గాని ఒక కొలిక్కి రాదు. సంక్రాంతి విడుదల కాబట్టి డిసెంబర్ లో కొద్దీ రోజులు రాజమౌళికి కొద్దీ రోజులు దీని ప్రమోషన్ కోసం చరణ్ ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది.
ఇక కలిసి నటించే సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు అన్ని జనవరి నుంచి ఫుల్ స్వింగ్ లో మొదలైపోతాయి. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అల్యూమినియం ఫ్యాక్టరీకి కొత్త రూపు రేఖలు ఇవ్వగా వాటి తాలూకు ఫోటోలు లీక్ కాకుండా అక్కడ ఎవరిని అనుమతించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది యూనిట్. స్క్రిప్ట్ మొత్తం లాక్ అయిపోగా హీరోయిన్ల సెలక్షన్ ఇంకా ఒక కొలిక్కి రాలేదని సమాచారం. ఎన్టీఆర్ పక్కన కీర్తి సురేష్ ని సంప్రదించగా ఓకే చెప్పినట్టు సమాచారం. మరి రామ్ చరణ్ పక్కన ఎవరు చేస్తారు అనే సస్పెన్స్ మాత్రం తొలగటం లేదు. స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు యూత్ హీరోలు చేస్తున్న సినిమాగానే కాకుండా కొణిదెల నందమూరి కాంబోలో వస్తున్న మూవీ గా ప్రేక్షకుల అంచనాలు దీని మీద మామూలుగా లేవు.