రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదో కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. బాడీ డబుల్ ఆర్టిస్టుగా చరణ్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి టైటిల్ నిర్ణయించలేదింతవరకూ. త్వరలోనే అధికారికంగా టైటిల్ ప్రకటించడానికి రెడీ అవుతున్నారట.
ఇప్పటికే మై నేమ్ ఈజ్ రాజు, బ్రూస్లీ టైటిల్స్, ఫైటర్ వంటి పేర్లను పరిశీలించారని చెప్పుకున్నాం. వీటిలో బ్రూస్లీ టైటిల్ వైపే చరణ్ మొగ్గు చూపించాడని ప్రచారమైంది. మధ్యలో సుప్రీం అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. అయితే పై టైటిల్స్ ఏవీ ఫైనల్ కాలేదు. ఈలోగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత చిత్రం టైటిల్ నే చరణ్ సినిమాకి అడాప్ట్ చేస్తున్నారని తెలిసింది. చివరికి చరణ్ కూడా ఈ టైటిల్ కి ఓకే చెప్పారని, ఆల్మోస్ట్ కన్ఫమ్ చేసేసినట్టేనని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారమవుతోంది.
విజేత టైటిల్ బావుంది. యువతరంలోకి సూటిగా దూసుకుపోయేలా ఉంది. అయితే శ్రీను చెబుతున్న కథలో అందుకు తగ్గ కంటెంట్ కూడా ఉండి తీరాలి. బాడీ డబుల్ ఆర్టిస్టు నుంచి ఫైట్ మాష్టర్ స్థాయికి ఎదిగే ఓ కుర్రాడి కథ ఇదని అర్థమవుతోంది. లక్ష్యం ఉన్న కుర్రాడు కాబట్టి విజేత యాప్ట్ అన్నమాట.