చెర్రీ-సుక్కూ.. బ్యాక్ డ్రాప్ ఇదే బాసూ

Update: 2016-08-21 11:30 GMT
రామ్ చరణ్ ఇప్పుడు బాగా అంటే బాగా బిజీ అయిపోయాడు. అటు తన మూవీ ధృవను దసరాకి సిద్ధం చేయడానికి పరుగులు పెడుతూనే.. ఇటు తండ్రి 150వ సినిమాకి సంబంధించిన నిర్మాణ పనులను చూసుకుంటున్నాడు. ఇదే టైమ్ లో మెగాస్టార్ బర్త్ డే కూడా వచ్చేయడంతో.. భారీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేందుకు ప్రిపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత బిజీలోనూ ధృవ తర్వాతి చిత్రం పనులను కూడా పూర్తి చేసేసుకుంటున్నాడు చరణ్.

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తో రామ్ చరణ్ తర్వాతి సినిమా చేయనున్నాడు. ఈ మూవీ కాన్సెప్ట్ పై ఇప్పటివరకూ చాలానే రూమర్స్ ఉన్నాయి. ఓ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నారనే టాక్ వినిపించింది. ఇప్పుడివన్నీ రూమర్స్ అనీ.. వీళ్లు ఓ పక్కా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. అది కూడా ఓ విలేజ్ నేపథ్యంలోనే ఈ సినిమా అంతా సాగుతుందట. కొన్ని పాటలు.. సన్నివేశాలు మినహాయిస్తే.. దాదాపుగా మూవీ అంతా పల్లెటూళ్లోనే తీయాలని డిసైడ్ చేశాడట సుకుమార్.

ప్రస్తుతం ధృవలో పోలీస్ గా కనిపించేందుకు మేకోవర్ చేసిన రామ్ చరణ్.. ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కూడా కొత్తదనం చూపిస్తాడని తెలుస్తోంది. పల్లెటూరి కుర్రాడిగా కనిపించేందుకు మరోసారి తన ఫిజిక్ ని ఛేంజ్ చేస్తాడట చెర్రీ. 
Tags:    

Similar News